– నేడు నిరసనలకు కెటిఆర్ పిలుపు
హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి31: సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ను వేధిస్తున్నదుకు నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు నేతలు నిరసన ప్రదర్శనలు చేయాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం రాష్ట్రమంతటా శాంతియుతంగా ఆందోళనలకు దిగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 12 వేలకుపైగా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని సూచించారు. నిరసనల్లో భాగంగా ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నాయి. నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు. ధర్నాలు, రాస్తారోకోల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయనున్నారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు ఆందోళనల్లో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నిరసనలు శాంతియుతంగా చేయాలని, పోలీసులతో ఘర్షణలు వద్దని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




