గురుపూజోత్సవం

మన జీవితాలలో గురువు ప్రాముఖ్యత చాలా విలువైనది. గురువనగా అజ్ఞానమనే చీకటిని( గు), తొలగించి జ్ఞానమనే వెలుతురు( రు) ప్రసాదించేవాడు. గురువు ఎవరికైనా అవసరం. పురాణాల కాలం నుండి నేటి వరకు ఎందరో మహనీయులకు తమ వెనుక గురువు ఉన్నారు. అర్జునుడు ద్రోణాచార్యుల గారి శిష్యరికంలో పరోక్షంగా ఏకలవ్యుడు కూడా ద్రోణాచార్యులు గారి శిష్యరికంలో స్వామి వివేకానంద గారు పరమహంస గారి శిష్యరికంలో ఉండి మంచి మార్గంలో నడిచారు. ఈ విధంగా గొప్ప గొప్ప వారు గురువు నీడలో ఉంటూ వారి సూచనలను సలహాలను పాటిస్తూ సన్మార్గంలో నడిచి మహోన్నత స్థానాలకు ఎదిగారు. అలాంటి గురువులను మనం ఈ రోజే కాకుండా ప్రతిరోజు కూడా వారికి పూజోత్సవాలు జరపడం ఎంతో అవసరం .కానీ నేటి సమాజం కంప్యూటర్ కంప్యూటర్ అని పరుగులు తీస్తున్నది దానిలో మంచి ఉంది చెడు ఉంది . ‘ఎదురయ్యే ప్రతి సంఘటన మంచి చెడు మార్గం చూపిస్తుంది’ మనం ఎంచుకునే దానిలో మన జీవితం ఉంటుంది . మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లు ప్రతి శిష్యుడు చిన్నప్పటి నుండి క్రమశిక్షణ మార్గంలో ఉంటూ క్రమశిక్షణతో చదువుకుంటూ వారి సలహాలు సూచనలు పాటిస్తారని ఆశిస్తూ ,

ప్రతి శిశువుకు మొట్టమొదటి గురువు8 అమ్మ .
” ఆశ నిరాశలతో అలసిన ఆమె కళ్ళు నాకై ఎదురుచూసే చల్లని లోగిల్లు పొక్కుతూ పోలుతూ నడిచే ఆమె గమనం నన్ను నడిపించే పావన గమనం ఆమె నాకు ఎలాంటి వారం ఇవ్వలేదు కానీ ఆమెను మించిన దైవం లేదు ఆమె పేరులో రెండే రెండు అక్షరాలు అవి నాకు ప్రాణం పోసే వరాలు ఆమె ఎవరో కాదు ఆమె మా అమ్మ”

ఎదురయ్యే ప్రతి సంఘటన మంచి చెడు మార్గాలను చూపిస్తుంది నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావో దాన్నిబట్టి జీవితం ఉంటుంది అంటారు పెద్దలు .అదే జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణన్ నిజజీవితంలో తన నాన్న వీరాస్వామి తనను పూజారి వృత్తి చేసుకోమని చెప్పారు  రాధాకృష్ణన్ కు మాత్రం ఉపాధ్యాయ వృత్తి పట్ల మంచి గౌరవభావం ఉంది .తాను ఉపాధ్యాయ వృత్తి కోసం విపరీతంగా కష్టపడి ఉపాధ్యాయ వృత్తి నుండి దేశ అత్యున్నత పదవి అయినా రాష్ట్రపతిగా ఎదిగారు . ఈ సందర్భంగా వారి గురించి తెలుసుకుందాం .సర్వేపల్లి రాధాకృష్ణ తమిళనాడులోని తిరుత్తని గ్రామంలో 1888 సెప్టెంబర్ 5న వీరాస్వామి సీతమ్మ దంపతులకు జన్మించారు . పైన చెప్పుకున్నట్లు తాను అనేక కష్టాలు పడి చదువుకుంటూ 1931 నుండి 36 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రెండవ వైస్ ఛాన్స్లర్ గా ఉన్నాడు. 1939 నుండి 1948 మధ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలనికి నాలుగో వైస్ ఛాన్స్లర్ గా పనిచేశారు  . అంచెలంచెలుగా ఎదుగుతూ 1949 నుండి 52 మధ్య సోవియాట్ యూనియన్ లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఎన్నికయ్యారు . అదేవిధంగా 1952 నుండి 1962 కాలం మధ్యకాలంలో భారతదేశానికి ప్రథమ ఉపరాష్ట్రపతి గా ఎన్నికయ్యారు  . 1962 నుండి 1967 వరకు రాష్ట్రపతిగా భారతదేశానికి సేవలందించారు . వారు  ఏ పదవిలో ఉన్న ఆ పదవికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు

తను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 25% జీతం తీసుకుని మిగతా జీతాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి ఇచ్చేవారు  .తాను ఒక తత్వవేత్తగా భారతదేశానికి అత్యున్నత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు  .వారి  దృష్టిలో తత్వం అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడం. భారతీయ ఆలోచన దృక్పథాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి అందులో వివేకం తర్కం ఇమిడి ఉన్నాయని
చూపించి భారతీయ తాత్విక చింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు .తను రాసిన ఎథిక్స్ ఆఫ్ ద వేదాంత అండ్ ఇట్స్ మెటీరియల్ రిసెప్షన్ ఎంతో పేరు ప్రతిష్టలు గల పుస్తకం గా చెప్పవచ్చు .అంతేకాకుండా వారు  రాసిన “ఇండియన్ ఫిలాసఫీ” పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.  ఎన్నో విశ్వవిద్యాలయాల్లో ప్రసంగించి భారతదేశం  ఔన్నత్యాన్ని చాటి చెప్పారు .  ఈ విధంగా రాధాకృష్ణన్ మన దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తూ ఉన్న క్రమంలో వారి  అభిమానులు ,శిష్యులు ఆయన  పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తామని చెప్తే దానికి అతడు చిరునవ్వుతో దానికి బదులుగా ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం గా చేయాలని కోరారు. ఆ రోజు నుండి వారి  పుట్టిన రోజును  ఉపాధ్యాయ దినోత్సవం గా మనం జరుపుకుంటున్నాం. అంటే 1962 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 ను మనం  ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

V. లక్ష్మీనారాయణ
9492829813
గజ్వేల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *