– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14: మన సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయానికి ప్రతీకగా నిలిచే మహత్తర పండుగ సంక్రాంతి. కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన ఆనందాన్ని కుటుంబీకులతో, స్నేహితులతో, పొరుగువారితో పంచుకునే అపూర్వమైన సందర్భం ఇది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే ఈ సంక్రాంతి పండుగ తెలుగు ప్రజల జీవనశైలిలో ఒక ఉత్సవంగా ఐకమత్యం.. సహకారం.. కృతజ్ఞతాభావాన్ని ప్రతిబింబించేదిగా నిలిచింది. అన్నదాతను గౌరవించుకునే ఈ పండుగ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తు చేసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతుల ఆదాయం పెంపు, సాగునీటి సదుపాయాలు, పంటల బీమా, రైతుల ఖాతాల్లో ఆర్థిక సహాయం (పీఎం కిసాన్) వంటి పథకాల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా నిరంతరం కృషి జరుగుతోంది. కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త సంకల్పాలతో ముందడుగేయాలని స్ఫూర్తినిచ్చే పర్వదినం. యువత కష్టపడి చదువు, ఉపాధిలో ముందుకు సాగాలి. మహిళలు స్వయం శక్తితో కుటుంబం, సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి. సంప్రదాయాలను గౌరవిస్తూ, ఆధునికతను స్వీకరిస్తూ ముందుకు సాగితేనే రాష్ట్రం, దేశం మరింత అభివృద్ధి చెందుతాయి. తెలుగు ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, సుఖసంతోషాలు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ కుటుంబాల్లో ఐశ్వర్యం వెల్లివిరియాలని, తెలుగు రాష్ట్రాలు, దేశం సుభిక్షంగా, సమృద్ధిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





