– ఏడాదిన్నరలో చేనేత రంగానికి రూ.వెయ్యి కోట్లు
– రైతన్న, నేతన్నల సంతోషమే ధ్యేయంగా రేవంత్ ప్రజా పాలన
– వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– నాంపల్లి చేనేత భవన్ లో ఐఐహెటీ ప్రయోగశాల ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16: ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ ఐఐహెచ్‌టీని తీర్చిదిద్దుతామని వ్యవసాయ, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రకటించారు. నాంపల్లి చేనేత భవన్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) ప్రయోగశాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో వెంకటగిరిలో ఐఐహెచ్‌టి ఉందని, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ చేనేత రంగానికి మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఒప్పించి ఐఐహెచ్‌టీి సాధించారని తెలిపారు. పూజ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ గౌరవార్ధం ఐఐహెచ్‌టీకి ఆయన పేరు పెట్టామని, బాపూజీ కీర్తిప్రతిష్ఠలు పెరిగేలా దేశంలోనే మంచి సంస్థగా నిలవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేనేత రంగానికి మహర్దశ పట్టనుందన్నారు. ఏడాదిన్నరలోనే చేనేత రంగానికి రూ.వెయ్యి కోట్లు నిధులు విడుదల చేశామని, గత ప్రభుత్వంలో రాజకీయ స్వార్థంతో హడావుడిగా పథకాలు ప్రారంబించి వదిలేశారని గుర్తు చేశారు. ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్‌తో చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించినట్లు తెలిపారు. రూ.50 కోట్లతో వేములవాడలో యార్న్ డిపో ఏర్పాటు చేసి ఇప్పటికే 2368 మెట్రిక్ టన్నుల నూలు మరమగ్గాల సంఘాలకు సరఫరా చేశామని, రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం పథకంలో భాగంగా నేతన్న పొదుపు, నేతన్న భరోసాలను అమలు చేస్తామని వివరించారు. నేతన్న పొదుపు కింద రూ.304 కోట్లు, మరమగ్గాల కార్మికులకు పొదుపు కింద రూ.68 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. మరమగ్గాల కార్మికులకు నూలు సబ్సిడీ పథకం కింద ఉన్న బకాయిలు రూ.40 కోట్లు చెల్లించామన్నారు.. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ రూ.33 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా చేనేత రంగం ప్రతీకగా నిలిచిందని, రైతన్న నేతన్నల సంతోషమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి వెల్లడిరచారు. కార్యక్రమంలో హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





