– యాదగిరిగుట్టలో 8వ రోజుకు బ్రహ్మోత్సవాలు
– రాత్రికి కనువిందుగా కల్యాణోత్సవం
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. లోక కల్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని ఈ సందర్భంగా అర్చకులు ఉపదేశించారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేద మంత్రాలు, వేదపారాయణలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామి వారి ఊరేగింపు నిర్వహించారు. రాత్రి స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించారు. ఉత్తర మాడవీధుల్లో ప్రత్యేకమైన కల్యాణ వేదికను సిద్ధం చేశారు. వీవీఐపీ, వీఐపీ, ఇతర భక్తులు స్వామి వారి కల్యాణాన్ని వీక్షించే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కొండపైన పలు ప్రాంతాల్లో ఎలఈడీ స్క్రీన్లను ఉంచారు. ఈ సేవలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, డీఈవో భాస్కర్‌శర్మ, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు, ఆలయ అధికారులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





