– 3వేల మంది పోలీసులతో బందోబస్తు
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్1: నగరంలో నిర్వహించనున్న హనుమత్ జయంతికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వహించడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. గురువారం హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉత్సవ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించాక పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రధాన యాత్రలో సుమారు 168 శోభాయాత్రలు కలవనున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకో కుండా సుమారు 3వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. యాత్ర నిర్వహణలో వలంటీర్లకు తగిన శిక్షణ ఇచ్చి, రోప్ పార్టీ సభ్యులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సీపీ సూచించారు. ఫ్లై ఓవర్లు, రైల్వే బ్రిడ్జిల వద్ద తగిన జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తు మళ్లింపులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సోషల్ డియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గౌలిగూడ రామమందిరాన్ని దర్శించుకున్న సీపీ సజ్జనార్ అక్కడి నుంచి తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం వరకు ఉన్న 12 కిలోటర్ల శోభాయాత్ర మార్గాన్ని వాహనంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో రోడ్లపై చెత్తాచెదారం, మట్టి కుప్పలు, రాళ్లు లేకుండా, రోడ్డుపైకి వచ్చే చెట్టుకొమ్మలు తొలగించే పనులు చేస్తున్నారు. ప్రజలు శాంతియుతంగా యాత్ర జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.