– హైదరాబాద్‌లో భారీగా శోభాయాత్ర
– సమీక్షించిన వివిధ శాఖల అధికారులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: ఏప్రిల్ 2వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో గత 22 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భారీ శోభాయాత్ర ఈ ఏడాది కూడా కర్మన్‌ఘాట్ నుండి ప్రారంభమై గౌలిగూడ రామ్ మందిరం చేరుకుంటుంది. అక్కడినుండి సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు సాగనుంది. ఈ భారీ యాత్రను పురస్కరించుకుని వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ సజ్జనార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, వీహెచ్‌పీ/బజరంగ్‌దళ్ నాయకులు పాల్గొన్నారు. యాత్ర సాగే మార్గంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, ఇతర మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం అధికారులు గౌలిగూడ రామ్ మందిరం నుండి అప్జల్‌గంజ్ విÖదుగా తాడ్‌బండ్ వరకు రూట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి, క్షేత్రస్థాయి పరిస్థితులను సవిÖక్షించారు. ఈ సందర్భంగా బజరంగ్‌దళ్, పలు హిందూ సంఘాల నాయకులు పోలీసులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. గతంలో అబిడ్స్ చౌరస్తా వంటి ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి యాత్రకు ఆటంకం కలిగించారని, ఈసారి అలాంటివి పునరావ తం కాకుండా చూడాలని కోరారు. అలాగే యాత్ర ముగిసే వరకు ఏర్పాటు చేసిన కాషాయ జెండాలను, అలంకరణలను తొలగించవద్దని విన్నవించారు. గణేష్ ఉత్సవాల తరహాలోనే శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకలకు కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా పండుగ వాతావరణంలో జరుపుకునేలా సహకరించాలని అధికారులను కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




