పంచాయతీ ప్రజాప్రతినిధుల కోసం కరదీపిక

– ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః పంచాయతీరాజ్ చట్టం-2018 ్ర‌ప‌కారం గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలకు సంబంధించి సమగ్ర సమాచారంతో తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ(టీజీఐఆర్‌డీ) రూపొందించింది. 292 పేజీలతో ఉన్న ఈ పుస్త‌కాన్ని నూత‌నంగా ఎన్నికైన స‌ర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు స‌భ్యుల సౌల‌భ్యం కోసం ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సోమ‌వారం ఆవిష్క‌రించారు. ఈ క‌ర‌దీపిక గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులకు ఎంతో ఉప‌యోగ‌కరంగా ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ లు హాజ‌ర‌య్యారు. అలాగే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు. కాగా పుస్త‌కాన్ని గ్రామ పంచాయ‌తీ స‌ర్పంచ్‌లు, ఉప స‌ర్పంచ్‌ల‌కు ప్ర‌భుత్వం అందించ‌నుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *