ఏసీబీకి చిక్కిన లంచగొండి అడిషనల్‌ ‌కలెక్టర్‌

– ప్రైవేట్‌ హైస్కూల్‌ అనుమతి రెన్యూవల్‌కు లంచం తీసుకుంటుండగా..
– డీఈవో కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ సహా పట్టివేత
– ట్రాప్‌ చేయించిన ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యం.. జిల్లాలో కలకలం

హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్‌, జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డిని అవినీతి నిరోధక శాఖ ట్రాప్‌ చేసింది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో రూ.60వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వెంకట్‌ రెడ్డిని పట్టుకున్నారు. హనుమకొండ కొత్తూరులోని క్రియేటివ్‌ ప్రైవేట్‌ హైస్కూల్‌ అనుమతి పునరుద్ధరణకు కోసం ఆ యాజమాని సతీష్‌ నుంచి రూ.60వేలు లంచం తీసుకుంటుండగా ఆయనతోపాటు డీఈవో కార్యాలయం జూనియర్‌ అసిస్టెంట్‌ మనోజ్‌ను కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గత డీఈవో కాలం నుండి ఆ స్కూల్‌ ఫైల్‌ పెండిరగ్‌లో ఉందని సమాచారం. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఒక జిల్లా ఉన్నతాధికారి, అడిషనల్‌ కలెక్టర్‌ స్థాయిలో ఉన్న అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకోవడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. దీనిపై కలెక్టరేట్‌లో ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. నెల రోజుల క్రితం డీఈవో వాసంతిని తప్పించిన ప్రభుత్వం ఆ బాధ్యతలను అదనపు కలెక్టర్‌ వెంకట్‌ రెడ్డికి అప్పగించింది. రెవెన్యూ, ఇతర పనుల ఒత్తిడి వల్ల విద్యా శాఖపై ఆయన పూర్తిగా సమయాన్ని కేటాయించలేక ోయారు. కిందిస్థాయి సిబ్బంది సూచనలు తీసుకుని పనిచేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *