– ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగసు్ట 25ః ఉమ్మడి జిల్లాల వారీగా తుది హ్యామ్ ప్రపోజల్స్ రూపొందించాలని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖa మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బి కార్యాలయంలో శాఖపై సోమవారం నాలుగు గంటలకుపైగా మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. విస్మరించిన వెనుకబడిన జిల్లాలకు హ్యామ్‌లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. హ్యామ్ రోడ్ల కోసం కొత్తగా భూ సేకరణ అవసరం లేదు కాబట్టి అదనపు భారం ఏమీ ఉండదన్నారు. ట్రాఫిక్ ఉన్న రోడ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. హ్యామ్ ప్రపోజల్స్‌లో 10కి.మీ పైగా ఉన్న రోడ్లను తీసుకోవాలని..కనెక్టివిటీ కారిడార్‌ను అభివృద్ధి చేసే విధంగా ఉండాలని సూచించారు. దీంతో రూరల్ తెలంగాణ సోషియో ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందన్నారు. సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్.. డబుల్ లేన్ నుండి పీవుడ్ షోల్డర్స్ (10 మీటర్ల) రోడ్డు.. ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ఫోర్ లేన్ రోడ్స్ కొన్ని హ్యామ్‌లోకి తీసుకుంటామన్నారు. కొత్త మౌలిక సదుయాలు పెంచడంతోపాటు పాత రోడ్ల నిర్వహణతోపాటు బలోపేతం చేస్తామని వివరించారు. దీంతోపాటు అధిక వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిన్న రోడ్ల కోసం అత్యవసరంగా రూ.100కోట్లు విడుదల చేయమని సీఎం రేవంత్ రెడ్డినీ కోరుతానని మంత్రి చెప్పారు. ఫీల్డ్ నుండి పూర్తి వివరాలు తెప్పించాలని సి.ఈ మోహన్ నాయక్‌ను ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ భూ సేకరణలో భూమి కోల్పోయిన వారి ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలనీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, స్పెషల్ సిఎస్ వికాస్‌రాజ్, ఆర్‌అండ్‌బి సీఈలు జయభారతి, మోహన్ నాయక్, రాజేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్, అన్ని జిల్లాల ఎస్‌ఈలు, ఈఈలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.