– I మేలో వేసవి సెలవులు
హైదరాబాద్, మార్చి 31: రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్‌లో అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట పద్ధతిలో నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయి. అలాగే మే 1 నుంచి 31 వరకు పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఇదే కాలంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు కూడా సెలవులు మంజూరు చేశారు. అయితే సెలవుల సమయంలో అంగన్‌వాడీ సిబ్బంది కొన్ని బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. వాటిలో భాగంగా పిల్లలకు టేక్ హోమ్ రేషన్ అందచేయాలి. 0-5 సంవత్సరాల పిల్లల్లో అభివృద్ధి లోపాలను ముందుగానే గుర్తించేందుకు ఇంటింటా సర్వేలు నిర్వహించాలి. ప్రీ-స్కూల్‌లో పిల్లల నమోదు, డ్రాపవుట్ అయిన పిల్లలను మళ్లీ అంగన్వాడి కేంద్రాల్లో చేర్చే విధంగా చర్యలు చేపట్టాలి. వేసవి సెలవుల్లో సిబ్బంది తాము నిర్వహించిన కార్యకలాపాలపై సమగ్ర నివేదిక సమర్పించాలి. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు జరిగే చైల్డ్ సేఫ్టీ వీక్, 25 నుంచి మే 30 వరకు నిర్వహించే ‘వుమెన్ థీమ్ వీక’ కార్యక్రమాల్లో అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొనాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఎం రేవంత్ రెడ్డికి, వమహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ తరఫున అధ్యక్షురాలు డి.అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




