– కెసిఆర్ పై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు సహించేది లేదు
– మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 02 : మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, దీనిని సహించేది లేదని మాజీ ప్రభుత్వ విప్ , మాజీ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించిన కేసును సిబిఐకి అప్పగించాలని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బి.ఆర్. ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం యాదగిరిగుట్టలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అనంతరం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ప్రపంచంలోనే తెలంగాణకు గుర్తింపు తీసుకువచ్చిన కేసీఆర్ చేసిన కృషిని కేసిఆర్ కు వస్తున్న పేరును ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దీనిని బిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రజలు కేసీఆర్ అభిమానులు గట్టిగా అడ్డుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ పార్టీకి బుద్ధి చెప్తారని అన్నారు. అంతకుముందు యాదగిరిగుట్టలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యాలయం నుండి వైకుంఠ ద్వారం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రామ్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య పట్టణ అధ్యక్షులు పాపట్ల నరహరి, ఆ పార్టీ సీనియర్ నాయకులు గడ్డమీది రవీందర్ గౌడ్, తోటకూరి అనురాధ బీరయ్య, కౌడే మహేందర్ రెడ్డి, మిట్ట వెంకటయ్య, కసాబ్ శ్రీనివాస్, బూడిద సురేందర్, ఆవుల సాయి, బుడిగ నరసింహారావు, పవన్ కుమార్ ముక్కెర్ల సతీష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



