ఈ ‌గుండె బతకాలి

ఎన్ని భాషలు
ఎన్ని వస్త్రధారణలు
ఎన్ని జీవన విధానాలు
ఒక నూతన మానవుణ్ణి కల గంటున్న నేలిది

నోరే లేని మనుషులకోసం
గొంతెత్తిన నేల
గడ్డిపోచలు కత్తులై
గడి గుండెల్లో తల ఎత్తిన నేల

స్వేచ్ఛ కోసం
నెత్తుటి ధారలు కావలి కూర్చున్న నేల
మాటకు మానవత నద్ది
మనిషి మాయం కాకుండ నొప్పులు పడుతున్న నేల
రంగు రంగుల పువ్వుల్ని
సీతా కోక చిలుకల్ల ఎగిరెస్తున్న నేల
రూపాల స్థూపాలు
లైట్‌ ‌హౌజ్లై నిలబడ్డ
కనిపించని ఒక ప్రవాహం
ఈ నేలలో ఈ మనుషులలో –

ద్వేషం చిమ్ముతున్న కాలాన్ని చూసి జాలిపడ్తోన్న
ఈ నేల గుండె బతకాలి !
ఈ విద్వేష కాలానికి
కొన్ని నవ్వుల నెలవంకలు
కొన్ని సహన పుష్పాలు
కొంత మానవీయత నిద్దాం రండి
  – వడ్డెబోయిన శ్రీనివాస్‌,9885756071

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *