గిన్నిస్‌ రికార్డు సాధించిన మెగా బతుకమ్మ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో సోమవారం నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం రెండు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సాధించింది. మొదటి రికార్డ్‌ మెగా బతుకమ్మ కాగా, రెండో రికార్డు ఎక్కువ మంది మహిళలు లయబద్దంగా బతుకమ్మ పాటలు పాడుతూ నర్తించినందుకు. గిన్నిస్‌ రికార్డు సాధనే లక్ష్యంగా 63.11 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పు, 11 లేయర్స్‌, 10.7 టన్నుల 9 రకాల పూలతో 300 మంది మహిళలు మూడు రోజులపాటు శ్రమించి భారీ బతుకమ్మ ఏర్పాటు చేశారు. ఒకేసారి 1354 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ భారీ బతుకమ్మను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో నమోదు చేస్తున్నట్టు గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు లయబద్ధంగా ఆడారు. మంత్రి సీతక్కకూడా బతుకమ్మ పాట పాడి అలరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *