సరూర్‌నగర్‌లో 29న ‘గిన్నిస్‌’ బతుకమ్మ పండగ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24 : ఈనెల 28న ఎల్‌.బి. స్టేడియంలో నిర్వహించతలపెట్టిన వరల్డ్‌ గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌ బతుకమ్మ ఈవెంట్‌ను 29వ తేదీకి వాయిదా వేసినట్లు పర్యాటక శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ బతుకమ్మ ఉత్సవాన్ని సరూర్‌ నగర్‌ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. బతుకమ్మ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరవుతారని తెలిపింది. వరసగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఎల్‌.బి స్టేడియం నుండి సరూర్‌ నగర్‌ స్టేడియంకు మార్చినట్లు పర్యాటక శాఖ తెలియచేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *