~ ముఖ్యంగా వ్యవసాయరంగానికి భారీ ఓదార్పు
~ ఉప్పు, పప్పు, సబ్బుల వంటి నిత్యావసరాల ధరలు తగ్గుదల
~ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
విశాఖపట్నం,సెప్టెంబర్17: దేశంలోని 140 కోట్ల మందికి వర్తించే విధంగా జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఈనెల 22 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. విశాఖపట్నంలోని మధురవాడలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ప్రధానంగా వ్యవసాయరంగానికి ఎంతో మేలు చేకూర నుందని అన్నారు. రైతులకు మేలు చేసే విషయంలో నష్టమైనా ఫర్వాలేదని ప్రధాని మోడీ పట్టుబట్టారని అన్నారు. ఇప్పటికే అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు చేకూరాయి. నాలుగు శ్లాబ్‌ల నుంచి రెండు శ్లాబ్‌లకు తగ్గించాం. 12 శాతంలో ఉండే వస్తువులు దాదాపు 99 శాతం 5 శాతం శ్లాబ్ పరిధిలోకి తీసుకొచ్చాం. 28 శాతం శ్లాబ్‌లో ఉండే సిమెంట్ సహా 90 శాతం వస్తువులు 18 శాతం శ్లాబ్ పరిధిలోకి తెచ్చాం. 2017కు ముందు 17 రకాల పన్నులు ఉండేవి.. వాటిపై 8 సెస్సులు కూడా ఉండేవి. ఉదాహరణకు 2017కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేది. అన్నింటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే పన్ను.. నాలుగు శ్లాబ్‌ల రూపంలో తీసుకొచ్చిందే జీఎస్టీ అని అన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.08 లక్షల కోట్ల ఆదాయం లభించింది. ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ తీసుకొచ్చాం. పాలు, పెరుగు సహా పలు నిత్యావసరాలను 5 శాతం శ్లాబ్ నుంచి సున్నా శాతానికి తీసుకొచ్చాం. మధ్యతరగతికి ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకున్నాం. కారు, ఫ్రిజ్, ఏసీని 28 శాతం నుంచి 18 శాతానికి తీసుకొచ్చాం. ఆత్మనిర్భర్ భారత్‌కు జీఎస్టీ నూతన సంస్కరణలు పెద్ద ఊతం. మహిళల ఆరోగ్యం కోసం శానిటరీ న్యాప్‌కిన్స్‌పై పన్నును సున్నా చేశాం. యూపీఏ ప్రభుత్వంలో 30 శాతం ఉన్న వస్తువులను ఇప్పుడు 5 శాతానికి తెచ్చాం. సరళతరమైన పన్ను విధానాన్ని తీసుకురాలేని వాళ్లు ఇప్పుడు విమర్శలు చేస్తారా? గతంలో 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేవాళ్లు. ఈ 8 ఏళ్లలో ఆ సంఖ్య 1.51 కోట్లకు చేరిందని నిర్మలా సీతారామన్ వివరించారు. ఇప్పటికే అనేక రంగాల్లో జిఎస్టి ప్రయోజనాలు చేకూరాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జిఎస్టి స్లాబులను నాలుగు నుంచి రెండుకు తగ్గించామని అన్నారు.అన్నింటినీ కలిపి ఒకే పన్ను, నాలుగు స్లాబ్ లుగా తీసుకొచ్చిందే జిఎస్టి అని తెలియజేశారు. 2017 కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేదని, 2017 కు ముందు 65 లక్షల మంది పన్ను చెల్లించే వారని అన్నారు. ఈ 8 ఏళ్లలో పన్ను చెల్లింపు దారులు 1.51 కోట్లకు చేరారని, 2018 లో జిఎస్టి ద్వారా రూ. 7.19 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని కొనియాడారు. 2025 లో జిఎస్టి ద్వారా రూ. 22.08 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, ప్రజలపై భారం తగ్గించేందుకే జిఎస్టి తీసుకొచ్చామని అన్నారు. వెన్న, నెయ్యి, వంటపాత్రలను 12 నుంచి 5 శాతానికి, పప్పులు, చింతపండు, ఉప్పును తెచ్చామని, హెయిర్ ఆయిల్, షాంపును 18 నుంచి 5 శాతానికి తీసుకొచ్చామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మధ్యతరగతి ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకున్నామని, కారు, ఫ్రిజ్, ఎసిని 28 శాతానికి తీసుకొచ్చామని చెప్పారు. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేశామని, పురుగులమందులు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను దృష్టిలో పెట్టుకున్నామని అన్నారు. సులభమైన పన్ను విధానం తేలేని వారు ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. యూపిఎ హయాంలో 30 శాతం పన్ను ఉన్న వాటిని 5 శాతానికి తెచ్చామని, మహిళల శానిటరీ న్యాప్ కిన్స్ పై పూర్తిగా పన్ను తొలగించామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. నవరాత్రులు ప్రారంభం నుంచే కొత్త జీఎస్టీ విధానం పని చేస్తుంది అని తెలియజేసింది. విస్తృతమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు అమలు చేయడం జరుగుతుంది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించింది. గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని అక్షేపించినా వినియోగదారులకు అంతిమంగా మేలు జరుగుతుంది.. వన్ నేషన్ వన్ ట్యాక్స్ విధానానికి జీఎస్టీ కౌన్సిల్ ఫెడరల్ వ్యవస్థగా మారింది.. న్యూజెన్ ట్యాక్స్ వల్ల రెండ లక్షల కోట్ల వరకు ప్రజల చేతుల్లో నగదు ఉంటుంది.. పప్పులు, ఉప్పులు సహా అన్నీ 5 శాతం పరిధిలోకి వచ్చేశాయ్ అని వెల్లడించింది. స్థూలంగా మధ్య తరగతికి మేలు చేసే విధంగా రూపొందించాం.. పేద, మధ్య తరగతి, రైతులు, దేశానికి ఉపయోగమైన సెక్టార్స్ ను పిల్లర్స్ గా పెట్టుకుని జీఎస్టీ రూపకల్పన జరిగింది అని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ పేర్కొనింది. ఇక, 144 వందే భారత్ రైళ్లు, 60 శాతం కంటే ఎక్కువ హైవేలు, విమానాశ్రయాలు రెట్టింపుతో పాటు సంక్షేమ పథకాలు, రక్షణ వ్యవస్థ బలోపేతం ఇవన్నీ జీఎస్టీ సొమ్ముతోనే చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మన డబ్బుని సరిగ్గా వినియోగించే ప్రభుత్వం మనకి కావాలి.. డీబీటీల ద్వారా రూ.3 లక్షల కోట్లు బోగస్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఆదా చేశాం.. జీఎస్టీ 2.0 తీసుకొస్తే ఎనిమిదేళ్లు ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేసినట్లు ఒప్పుకుంటున్నారా అని ప్రతిపక్షాలు మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పదేళ్లు జీఎస్టీని తీసుకురాకుండా కాలయాపన చేసిన యూపీఏ ప్రభుత్వానికి జీఎస్టీపై మాట్లాడే అర్హత లేదు అన్నారు. కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





