జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌, ‌డీజిల్‌లను తేలేం

– ఏకరూప పన్ను విధానం మన దేశంలో అసాధ్యం
– కేంద్ర అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడి

– న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 5:‌మన దేశ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితమైనదని, ఇలాంటి సమయంలో ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం అసాధ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) స్వరూపంలో కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలపై ఆమె మాట్లాడారు.తమ ప్రభుత్వానికి పౌరుల అవసరాలే ప్రథమ ప్రాధాన్యమని, ఆ తర్వాతే ఆదాయం గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. టారిఫ్‌ల వల్ల ఎగుమతిదారులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారంపైనా కేంద్రం దృష్టిపెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతానికి పెట్రోల్‌, ‌డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనేదీ లేదని మరోసారి స్పష్టం చేశారు. సామాన్యులపై పన్ను భారం తగ్గించేందుకే జీఎస్టీ విధానంలో ఈ సవరణలు చేసినట్లు తెలిపారు. జాతీయ డియా సంస్థ ’ఇండియాటు డే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మల ఈ వ్యాఖ్యలు చేశారు. వన్‌ ‌నేషన్‌- ‌వన్‌ ‌ట్యాక్స్ ‌మంచి ఆలోచనే కానీ.. ఆచరణలో అది సాధ్యం కాదు. అభివృద్ధిలో వైవిధ్యాలు ఉన్నప్పుడు ఏకరూప జీఎస్టీ రేటును అమలు చేయడం అన్యాయమవుతుంది. మెర్సిడెస్‌ ‌బెంజ్‌ ‌కారు, హవాయి చెప్పులకు ఒకే పన్ను రేటు విధించగలమా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితంగా ఉంది. అభివృద్ధి చెందిన రంగాలు అధిక పన్నులను కట్టగలుగుతాయి. అభివృద్ధి చెందని రంగాలకు అది భారమవుతుంది. ఒకవేళ భారత్‌ అన్ని రంగాల్లో సంపూర్ణంగా అభివృద్ధి చెందితే అప్పుడు ఒకే పన్ను విధానం సాధ్యమవుతుందని నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడించారు. ఈ సందర్భంగా విపక్ష కాంగ్రెస్‌ ‌పార్టీపై ఆర్థిక మంత్రి విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు జీఎస్టీని గబ్బర్‌ ‌సింగ్‌ ‌ట్యాక్స్ అం‌టూ ఎగతాళి చేసిన వారే.. ఇప్పుడు పన్ను సంస్కరణలు చేయగానే క్రెడిట్‌ ‌తీసుకునేందుకు ఆరాటపడుతున్నారు. గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో 91శాతం వరకు ఆదాయపు పన్ను విధించిన రోజులు ఉన్నాయని దుయ్యబట్టారు. జీఎస్టీలో సంస్కరణ వల్ల రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా ఆదాయంలో కొంత కోత ఉంటుందని  నిర్మలాసీతారామన్‌  ‌తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *