వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని మినహాయించాలి

– కేంద్ర మంత్రి నిర్మలకు భట్టి, తుమ్మల విజ్ఞప్తి

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 4: రాష్ట్రంలో ఇటీవల వర్షాలకు కలిగిన నష్టాల గురించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను గురువారం దిల్లీలో కలిసి వివరించారు. భట్ట్‌ితోపాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నిర్మలను కలిశారు. పామ్‌ ఆయిల్‌పౖౖె దిగుమతి సుంకాన్ని 44శాతానికి పునరుద్ధరించాలని మంత్రులు ఆమెను కోరారు. వ్యవసాయ పరికరాలు, బిందు, తుంపర సేద్యం పరికరాలపై ఉన్న 12శాతం జీఎస్టీని మినహాయించాలని కూడా విజప్తి చేశారు. అలాగే చేనేత వస్త్రాలపై ఉన్న 5శాతం జీఎస్టీని మినహాయించాలని విజప్తి చేశారు. మంత్రుల వెంట రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌ ఉన్నారు. కాగా, దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి చంద్రశేఖర్‌ పెమ్మసానిని మంత్రి తుమ్మల
కలిశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలం మండలంలోని తండాలకు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం రూ.110 కోట్లు మంజూరు చేయాలని విజప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *