జీఎస్ఎల్వీ – ఎఫ్ 16 ప్ర‌యోగం మహత్తర ఘట్టం

– ఇస్రోకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 30 :  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిసార్  ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన జీఎస్ఎల్వీ – ఎఫ్ 16  ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ విజయం భారత అంతరిక్ష పరిశోధన ప్రయాణంలో కీలకమైన మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం గారు అన్నారు. అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) సహకారంతో చేపట్టిన ఈ మిషన్ విజయం అంతరిక్ష పరిశోధన చరిత్రలో మహత్తరమైన ఘట్టమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. “ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ – నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్  ఉపగ్రహాన్ని మోసుకెళ్ళిన జీఎస్ ఎల్వీ-ఎఫ్16 ప్రయోగం చరిత్రాత్మక పురోగతికి నిదర్శనం” అని పేర్కొన్నారు.  నిసార్ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ అంతర్జాతీయ శాస్త్రీయ సహకారంలో ముందడుగు అని, ఇందులో భారతీయ శాస్త్రవేత్తల పనితీరు గర్వకారణమని ముఖ్యమంత్రి కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *