రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది

– బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి

సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మార్చి 10: తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎలఎం-6, ఎలఎం-4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. సిరిసిల్ల-తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పలువురు నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. పోలీసులు ధర్నా చేస్తున్న రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ తంగళ్లపల్లి 11వ ప్యాకేజీ రంగనాయక సాగర్ ద్వారా కెనాల్ నిర్మాణ పనులకు రూ.3 కోట్లు కేటాయించి పనులు చేపట్టకపోవడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో సుమారు 15 గ్రామాలకు నీరందించే కెనాల్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, స్థానిక ఎమ్మెల్యే Âకేటీఆర్ కానీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కెనాల్ నిర్మాణం ద్వారా 10 వేల ఎకరాలకు సాగు నీరందుతుందని, అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. నిధులు మంజూరైనా భూసేకరణ పనులు చేపట్టలేదని విమర్శించారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే కేటీఆర్ నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు. కెనాల్ నిర్మాణం కోసం రైతులు దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *