మధ్యాహ్న భోజనం తయారీకి గ్రీన్‌ ఫీల్డ్‌ కిచెన్‌

– భూమి పూజకు రావాలని సీఎంకు ‘అక్షయ పాత్ర’ ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: కొడంగల్‌ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. పౌండేషన్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని కలిశారు.
నవంబర్‌ 14వ తేదీన కొడంగల్‌లో నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ ఫీల్డ్‌ కిచెన్‌ నిర్మాణ శంకుస్థాపకు రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు కొడంగల్‌ సమీపంలోని ఎన్కేపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో అక్షయ పాత్ర ఫౌండేషన్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ కిచెన్‌ నిర్మించనుంది. ఈ కిచెన్‌లో వండిన భోజనాన్ని నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు సరఫరా చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థికి రూ.7 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుండగా నాణ్యమైన భోజనం తయారు చేసి అందించేందుకు అక్షయ ఫౌండేషన్‌ రూ.25ల వరకు ఖర్చు పెడుతోంది. ప్రభుత్వం చెల్లించే నిధులకు అదనంగా అయ్యే ఖర్చును అక్షయ పాత్ర ఫౌండేషన్‌ భరిస్తున్నది. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్‌) నిధుల సాయంతో ఈ పథకం అమలుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో పిల్లలకు అల్పాహారం అందించే పథకం విజయవంతంగా అమలవుతున్నది. 312 పాఠశాలల్లో దాదాపు 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజూ అల్పాహారం అందిస్తున్నారు. అన్ని గ్రామాల్లో పిల్లలు, తల్లిదండ్రుల నుంచి ఈ పథకానికి మంచి స్పందన వచ్చింది. ఈ పథకం దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *