ఉమ్మడి నల్లగొండ సస్యశ్యామలానికి ప్రణాళికలు

– పెండిరగ్‌ ప్రాజెక్టుల పూర్తికి రూట్‌ మ్యాప్‌
– 2027 నాటికి ఎస్‌ఎల్‌బీసీ పూర్తి
– కొత్తగా మంజూరైన ఎత్తిపోతల పధకాల పూర్తికి చర్యలు
– మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ఎస్‌ఎల్‌బిసి పనులు 2027 డిసెంబర్‌ మాసాంతానికి పూర్తిచేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. తద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు సమృద్ధిగా అందించడంతోపాటు సురక్షితమైన తాగునీరు అందించవచ్చన్నారు. అదేవిధంగా హైలెవల్‌ కెనాల్‌ నుండి లో లెవల్‌ కెనాల్‌ పనులు పూర్తి చేయడంతోపాటు ఎస్‌ఎల్‌బీసీ ప్రారంభమైతే లోలెవల్‌ కెనాల్‌ పంప్‌ హౌజ్‌ల ద్వారా సరఫరా చేస్తున్న నీటి వినియోగానికి నెల వారీగా చెల్లిస్తున్న రూ.కోటి 2 లక్షల విద్యుత్‌ భారం నుండి బయటపడగలమని తెలిపారు. ం ఎర్రమంజిల్‌ కాలనీలోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో నల్లగొండ, భోనగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రాజెక్టుల పురోగతిపై ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులతో ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అందులో కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎస్‌ఎల్‌బీసీని డిసెంబర్‌ 2027 నాటికి పూర్తి చేసే లక్ష్యంగా పెట్టుకుని రూట్‌ మ్యాప్‌ రూపొందించినట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి పునరుద్ధరణ అంశంపై నీటిపారుదల శాఖ ఇంజినీర్లు రూపొందించిన నివేదికను ఈనెల 15న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించి మంత్రివర్గ ఆమోదంతో పనులు మొదలుపెడతామని ఆయన స్పష్టం చేశారు. ఆందుకు సంబంధించిన టన్నెల్‌-1, పెండ్లిపాకల రిజర్వాయర్‌, టన్నెల్‌-2ను పూర్తి చేసుకుని 25 కి.మీ మెయిన్‌ కెనాల్‌ ద్వారా హైలెవల్‌ కెనాల్‌లో కలిపి సాగునీరందిస్తామన్నారు. ఎస్‌ఎల్‌బిసి పూర్తయితే హైలెవల్‌ కెనాల్‌ ద్వారా 2.20 లక్షలు, ఉదయసముద్రం ద్వారా లక్ష ఎకరాలకు, లో లెవల్‌ కెనాల్‌ ద్వారా 80 వేల ఎకరాలకు నీరు, మారుమూల గ్రామాలకు సురక్షిత తాగునీరు అందిస్తామని పునరుద్ఘాటించారు. డిరడి ఎత్తిపోతలను పూర్తి చేయడం ద్వారా 8 రిజర్వాయర్ల నుండి 3.61 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంగా పనులు సాగుతున్నాయని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన ఎదుళ్ల రిజర్వాయర్‌ నుండి దుందుభి వాగు వరకు నీటిని రప్పించేందుకు ఐదు ప్యాకేజీలుగా విభజించి పనులు ప్రారంభించినట్లు చెప్పారు. అటవీ శాఖ అనుమతులు, ఇతరత్రా కారణంగా నిలిచిన చింతపల్లి, ఇర్శిన్‌ రిజర్వాయర్ల పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కొత్తగా 11 ఎత్తిపోతల పధకాలు నిర్మణాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఒక్క మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోనే ఐదింటికి అనుమతులు మంజూరు చేయగా మిగిలినచోట్ల మరో ఐదింటికి అనుమతించామన్నారు.
ఎస్‌ఎల్‌బిసికి అనుబంధంగా నిర్మించిన ఉదయసముద్రం పనులు 70 శాతం పూర్తికాగా మిగిలిన పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. ఉదయ సముద్రం పరిధిలోని బ్రాహ్మణవెళ్లంల రిజర్వాయర్‌ పూర్తయిందని, కెనాల్‌ నెట్‌వర్క్‌ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. సుదీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వల పూర్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. బస్వాపూర్‌ రిజర్వాయర్‌ పనులు 93శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఇది పూర్తి అయితే 23,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అదేవిధంగా గందమళ్ల రిజర్వాయర్‌ పరిధిలోని రావెల్‌ కోల్‌ లింక్‌ కెనాల్‌, ప్యాకేజ్‌ 16, తురకపల్లి కెనాల్‌, ఎం.తురకపల్లి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. సమావేశంలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు బాలునాయక్‌, వేముల వీరేశం, కుంభం అనిల్‌ రెడ్డి, కుందూరు జయధీర్‌ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామ్యేల్‌, నీటిపారుదల శాఖ సలహాదారులు అదిత్యా దాస్‌నాధ్‌, లెఫ్టినెంట్‌ జెనరల్‌ హార్పల్‌ సింగ్‌, ప్రత్యేక అధికారి పరిక్షిత్‌ మేహ్ర, ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ శివకుమార్‌ నాయుడు, నల్లగొండ, భోనగిరి యాదాద్రి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు ఇల త్రిపాఠి, మంత్రిప్రగడ హనుమంత రావు, తేజస్‌ నందాలాల్‌ పవార్‌, ఈఎన్‌సీలు అంజద్‌ హుస్సేన్‌, శ్రీనివాస్‌, రమేష్‌బాబు సీఈ అజయ్‌కుమార్‌, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *