- మేయర్ అధ్యక్షతన బల్దియా సర్వ సభ్య సమావేశం
– పాల్గొన్న శాసనమండలి,శాసనసభ సభ్యులు, కార్పొరేటర్లు
వరంగల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాలు సోమవారం నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిల్ 39 అంశాలకు, రూ.130 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశం లో శాసనమండలి సభ్యులు బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముందుగా ఇటీవల మృతి చెందిన ప్రముఖ సహజ కవి అందెశ్రీ తో పాటు మాజీ కౌన్సిలర్ బైరీ సాంబయ్యలకు కౌన్సిల్‌లో నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా కౌన్సిల్ సమావేశాన్ని ఉద్దేశించి మేయర్ మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు అధికారులు అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల మొంథా తుఫాన్ వరదల వల్ల వరంగల్ మహా నగరపాలక సంస్థలోని కాలనీలు జలదిగ్బంధంలో ఉన్న కాలనీలను సిఎం ఏరియల్ సర్వే నిర్వహించి పలు ప్రాంతాల్లో వరద బాధిత కుటుంబాలను ప్రత్యక్షంగా కలుసుకొని వారికి ఆర్థిక భౌతిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అండగా ఉన్నదని ధైర్యం కల్పించారు. వరదల్లో నష్టపోయిన ఓరుగల్లు నగర ప్రజలకు సహాయం చేస్తానని మాట ఇచ్చి నిలుపుకొన్నారన్నారు. వరద వల్ల దెబ్బతిన్న ఒక్కొక్క ఇంటికి 15,000-వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటుగా వరద బాదిత కుటుంబాలకు ఒక నెల రేషన్ అదనంగా మంజూరు చేశారని తెలిపారు. వరద ముంపు తప్పించేందుకు, నగర ప్రజల ఇబ్బందులను శాశ్వత పరిష్కారం దిశగా దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్దం చేయాలని సిఎం ఆదేశించారన్నారు. వారి ఆదేశాల మేరకు ప్రణా ళికలు సిద్దం చేశామన్నారు. గత15 ఏళ్లుగా ఏర్పడుతున్న ఇబ్బం దులకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి•, పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపి డాక్టర్ కడియం కావ్య, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య,పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కెఆర్ నాగరాజులకు ధన్యవాదాలు తెలిపారు.
అమృత 2.ఓ పథకం ద్వారా వరంగల్ నగరానికి రూ.551 కోట్ల మంజూరయ్యాయన్నారు. ఈనిధులతో రానున్న 20 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తాగు నీటి సరఫరా పనులు 24/7 నీటి సరఫరా పనులకు డి.పి.ఆర్.లు సిద్ధమవుతున్నాయన్నారు. ఈ పనులు పూర్తయితే వరంగల్ నగర ప్రజలకు రోజు తాగునీటి సరఫరా, వ్యాపార వాణిజ్య కనెక్షన్లకు ప్రతిరోజు నీటి సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది. సిఎం రేవంత్ రెడ్డి నగర అభివృద్ధి పథకం కింద వరంగల్ మహా నగర పాలక సంస్థకు ప్రతిపాదనలు పంపిన తదుపరి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. ఈ రూ.50 కోట్లనిధులతో నగరానికి బహులార్ధకంగా ఉపయోగపడే పనులు ప్రతిపాదించడం జరుగుతోందన్నారు. వరంగల్ మహా నగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దడానికి అడుగులు పడ్డాయని, 66డివిజన్లలో ఇళ్ల వద్దనే తడి పొడి చెత్తను వేరు చేసేందుకు 198 మం ది వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నామని, వీరు ప్రతి ఇంటికి వెళ్లి తడి పొడిచెత్త సేకరణపై ప్రజల్లో అవగాహన కల్పించి చెత్త సేకరణకు తోడ్పడు తారన్నారు. సోమవారం కౌన్సిల్‌లో లాంచనంగా ప్రారంబించు కుంటున్నా మన్నారు. అదేవిధంగా చెత్త శుద్ధికరణకు ముందడుగు వేస్తున్నామని, 100 టి.పి.డి సామర్థ్యం గల బయోమిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్.ఎఫ్.పి పద్దతిలో టెండర్లు పిలవడం జరిగిందన్నారు. 100 టి.పి.డి చెత్తను శుద్ధి పరిచేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడ తాయని, నగరంలోని ప్రధాన రోడ్లు కూడల్లులో చెత్త తరలిం పుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. నగరంలో చెత్త వేసే ప్రదేశాలకు ప్రత్యేక ప్రణాళికలు చేపట్టడం జరిగిందన్నారు. వరంగల్ మహానగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు అమలు చేశామని, దేశంలో శుభ్రత నగరాలుగా పేరుగాంచిన ఇండోర్, జైపూర్లను ఇటీవల మేయర్ కార్పొరేటర్ బృందం అధికారులతో కలిసి సందర్శించడం జరిగిందన్నారు. వరదల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో అత్యవసర పనుల నిమిత్తం ప్రతి డివిజన్ కు రూ.5 లక్షలు మంజూరు చేయడానికి ఈ సందర్భంగా కౌన్సిల్లో ప్రతిపాదిస్తున్నామన్నారు.
వరద ముంపు లో విస్తృతమైన సేవలు అందించిన పారిశుద్ధ్య సిబ్బందికి, డ్రైవర్లకు ప్రోత్సాహకంగా రూ.వెయ్యి రూపాయల చొప్పున అందజేయడం జరిగిందన్నారు. హార్టికల్చర్ విభాగంలో పనిచేసే సిబ్బంది గెజిట్ నోటిఫికేషన్ ప్రకారంగా మలేరియా విభాగ సిబ్బందికి పెంచిన విధంగా చెల్లించడం జరుగుతుందని, జవాన్‌లు ఎదుర్కొంటున్న సమస్య లను పరిష్కరించడమే కాకుండా వారికి కూడా స్కిల్డ్ లేబర్ కింద కౌన్సిల్ ద్వారా అప్రూవల్ తీసుకుని ప్రభుత్వ నిబందనల ప్రకారం వేతనాలు చెల్లించడం జరుగుతుందన్నారు.
బల్దియాకు చెందిన భారీ (హెవీ వెహికిల్స్) వాహనాలు నడిపే సిబ్బందికి వేతనాలు పెంచడం జరుగుతుంది. వర్షాకాలంలో సిబ్బందికి రెయిన్ కోట్‌లు అందించడం, చలికాలంలోస్వెట్టర్ లు (చలికోట్లు), వేసవి కాలంలో టోపీలు అందిస్తున్నామని, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది రక్షణ కోసం వ్యక్తిగత రక్షణ పరికరాలు (పి.పి.ఈ కిట్లు) క్రమం తప్పకుండా అందజేస్తున్నామన్నారు. చలికాలం మొదలైనందున త్వరలో స్వెటర్లు అందజేస్తామన్నారు. 60సం.లు పైబడి అనారోగ్యానికి గురైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుమెడికల్ గ్రౌండ్స్ పై వారి స్వీయ ఆమోదం మేర కు వారి కుటుంబీకులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతోందన్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికులకు కార్పొరేషన్ తరఫున చేయూత అందిస్తున్నా మని, అంతేకాకుండా ప్రభుత్వం తరపు నుండి కూడ నష్టపరిహారం అందేలా ప్రభుత్వానికి లేఖ రాశామని తెలియజేస్తున్నాను. పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు కార్పొరేట్ ఆసుపత్రులతో సమన్వయం చేసుకుంటూ అన్నిరకాల పరీక్షలు నిర్వహించడంతో పాటు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల సహకారంతో పారిశుధ్య సిబ్బందికి సంపూర్ణ వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేయనున్నామన్నారు. సాస్కి(స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్) పథకం లో భాగం గా చారిత్రాత్మక నేపధ్యం కలిగిన వరంగల్ నగరం లో పురాతత్వ విధానాలను ప్రోత్సహించి అభివృద్ధి చేయాలని, నైబర్ హుడ్ ప్రణాళిక అంశం లో పాదచారులు నడిచే మార్గాలను అభివృద్ధి చేయడం, మౌలిక వసతులను కల్పించడం, ప్రజలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టడం తో పాటు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పార్కుల అభివృద్ధి, ఓపెన్ స్పేస్ లను అభివృద్ధి చేయడం స్పాంజ్ పార్క్ ఏర్పాటు, సిటీ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా నగరం లో 50 ఎకరాల్లో పచ్చదనాన్ని పెంపొం దించడం తో పాటు నగరం లోగల చారిత్రాత్మక (పురాతన) బావులను పునరుద్ధరించే అంశాలతో బల్దియా పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు పథకం అమలయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.
అధికారుల తీరు, విభాగాల మధ్య సమన్వయం లేదు : బస్వరాజు సారయ్య
శాసనమండలి సభ్యులు మాట్లాడుతూ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ రాష్ట్రముఖ్యమంత్రి హైదరాబాద్ తర్వాత రెండో అతి పెద్ద నగరంగా వరంగల్ కు ప్రాధాన్యం ఇచ్చి ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తున్నారని కానీ అధికారుల తీరు బాగాలేదని, విభాగాల మధ్య సమన్వ యం లేకపోవడం బాధాకరమన్నారు. గ్రీవెన్స్‌లో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోకపోవడం సరి కాదని, టాన్ ప్లానింగ్ అధికారులు తమ పని తీరులో మార్పు రావాలని, ప్రజా ప్రతిని ధులుగా ప్రజల సమస్యల పరిష్కారానికి లేఖలు రాస్తే స్పందన కరువైందని, సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న తనకు ఇలాంటి పరిస్థితులు ఎదురవు తున్నాయన్నారు. మంత్రుల స్థాయిలో వేగం గా అనుమతులు పొందుతున్న నగరంలో అనుమతులకు అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు.
ఎయిర్‌పోర్టు, అండర్ గ్రౌండ్ డిపిఆర్ సిద్ధంగా ఉంది : ఎమ్మెల్యే నాయిని
వరంగల్ (పశ్చిమ) ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ కు సంబంధించి గత 10 సం.లకు ప్రస్తుత 2 సం.లలో జరిగింది గమనించాలని ఎవరికైన అనుమానాలు ఉంటే తీసుకెళ్లి చూపించడానికి సిద్ధం అని, నగరంలో వరదలు వచ్చాయని 24 గంటల్లో ముఖ్యమంత్రినీ తీసుకువచ్చి ఇంటికి రూ.15 వేలు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నామన్నారు. సోమవారం నుండి అట్టి డబ్బు అకౌంట్ లో జమ అవుతాయన్నారు. ఆశాజనకంగా లేకున్న నగర అభివృద్ధికి పెద్ద పీఠ వేస్తున్నామని, ఎయిర్పోర్ట్‌కు సైతం భూసేకరణ పూర్తి కావడం జరిగిందని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా డిపిఆర్ సిద్ధంగా ఉందని త్వరలో టెండర్ దశకు వెళ్లనుందని స్వల్ప కాలంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మొదలు కానున్నాయన్నారు. పార్టీలకు అతీతం గా తాము డివిజన్‌ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని అన్ని పార్టీల కార్పొరేటర్లు సమన్వయంతో నగరాభివృద్ధికి కలిసి పని చేయాలని, అభివృద్ధి పనులను ఒక దాని తర్వాత మరొకటి చేసుకుంటూ వస్తున్నామని ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. మూతబడి విజయ డైరీనీ ఇటీవల మంత్రిని తీసుకువచ్చి వారిచే ప్రారంభింపజేశామని దానికి రూ.28 కోట్లు కు మంజూరు తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో డివిజన్ అభివృద్ధి కి రూ.50 లక్షలు ఇచ్చేవారని ప్రస్తుతం రూ. 2-3 కోట్లు ఇస్తున్నామని గతంలో కేటాయించిన స్మార్ట్ సిటీ నిధులను సమర్థవంతంగా వినియోగిం చుకోవడం వల్ల వెనక్కి వెళ్ళాయని వడ్డేపల్లి చుట్టూ ఉన్న రోడ్లు స్మశాన వాటికలు హాస్పిటల్‌లును రెండు సం.ల్లో కట్టించామని కార్పొరేషన్ లోని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కేవలం నోటీసులకు పరిమితం అయ్యారని వారి వల్ల కార్పొరేషన్ కు నష్టం వాటిల్లుతుందని అసహనం వ్యక్తం చేశారు.
ఓపెన్ ప్లాట్‌లో నీరు నిలవకుండా చూడాలి : ఎమ్మెల్యే నాగరాజు
వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు మాట్లాడుతూ ఓపెన్ ప్లాట్ ఓనర్ లకు నోటీసులు ఇచ్చి నీరు నిలవకుండా చూడాలని, తద్వారా డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హాం రోడ్లను అభివృద్ధి చేసే కార్యక్రమాలను ముఖ్యమంత్రి తీసుకురావడం జరిగిందని వారికి వరంగల్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. కాంట్రాక్టర్లు ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వారికి బ్యాంకు లోన్లు ఇచ్చే విధంగా తీసుకువచ్చారని, వడ్డేపల్లి చర్చ్ వద్ద గల పాత రోడ్డును తండాకు అనుసంధానించేలా చూడాలని తన నియోజక వర్గ పరిధిలో కొంత మంది కాంట్రాక్టర్లు పనులు.చేయకుండా పెండింగ్‌లో ఉంచారని వారికి నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ముంతా తుఫాను వల్ల 55,56 డివిజన్‌లతో పాటు 57వ డివిజన్ సమ్మయ్య నగర్ ప్రాతం తీవ్ర ప్రభావానికి గురికావడం జరిగిందని తీవ్ర నష్టం జరిగిందన్నారు.అక్కడ స్థానికంగా గ్రిల్స్ ఏర్పాటు సరిగా లేదని ఇరిగేషన్ అధికారులుమున్సిపల్ కార్పొరేషన్ నుండి ఇంజనీ రింగ్ అధికారులను నియమించి సమన్వయం చేసేలా చూడాలన్నారు. వడ్డేపల్లి చెరువు నుండి వచ్చే వరద నీరు వెళ్ళిపోవడానికి శాశ్వత పరిష్కారం చూపాలని ఇంత కంటే ఎక్కువ వరద నీరు వచ్చిన తట్టుకునేలా సైడ్ వాల్ లు నిర్మించాలని, మేడారం జాతర సందర్భంగా 3 వ డివిజన్ నుండి ఆరేపల్లి వరకు ఉన్న రోడ్డు ను పూర్తి చేసి ఆరేపల్లి వద్ద జంక్షన్ వరకు వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.
నగరంలో కోతులు, కుక్కల సమస్యలకు పరిష్కారం : కమిషనర్
నగరంలో కుక్కలు, కోతుల సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని, కోతుల సమస్య పరిష్కారానికి ఇటీవల టెండర్ పిలిచి ఒక్కో కోతిని పట్టుకోవడానికి రూ.520 చెల్లించేలా ఖరారు చేశామని కమిషనర్ బాజ్ పాయి తెలిపారు. నగర వ్యాప్తంగా సుమారు 28 వేల వీధి కుక్కలు ఉన్నాయని బల్దియా నుండి అదనంగా మరో ఏబిసి సెంటర్ ను ఏర్పాటు చేశాం కుక్కల సంతతి పెరగకుండా రేబిస్ వ్యాధి సంక్రమిం చకుండా వాటికి ఇంజెక్షన్లు ఇస్తున్నామన్నారు. ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు జన సమూహ ప్రాంతాలైన హాస్పిటళ్ళు, రైల్వే బస్ స్టేషన్ ప్రాంతా ల్లో కుక్కలు లేకుండా ఊరిబయట షెల్టర్ లు ఏర్పాటు చేయాలని సూచిం చిందని ఇందుకోసం ఊరి బయట స్థలాలను అనేషించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి రూపొందించిన ‘‘మైజీడబ్ల్యూ ఎంసిఆప్’’ పజల అవగాహన కోసం రూపొందించిన వాల్ పోస్టర్‌ను మేయర్,శాసనసభ్యులు, కమిషనర్‌లు సంయుక్తంగా ఆవిష్కరిం చారు.ఈసమావేశంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, డిప్యూటీ మేయర్ రిజ్వానా, షమీమ్ మసూద్‌తో పాటు బల్దియా ఇంజనీరింగ్ శానిటేషన్ హార్టికల్టర్‌టౌన్‌ప్లానింగ్, ఎన్‌పిడిసిఎల్,పబ్లిక్ హెల్త్ విభాగాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




