కాంగ్రెస్ కు సమాధి, టీడీపీ రేవంత్ పునాది..!

“ఎలాగూ ఎన్డీయే కూటమిలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు..ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని తెలంగాణలో టీడీపీ బలోపేతానికి అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ క్యాడర్ కు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.. అటు టీటీడీపీకి భవిష్యత్తు లీడర్ తానే అన్న సంకేతాలు కూడా టీటీడీపీ క్యాడర్ కు రేవంత్ ఇస్తున్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.. పొత్తులతో తప్ప బీజేపీ గెలవలేదు.. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే గెలవ వచ్చన్న ఉద్ధేశ్యంతో రేవంత్ పదేపదే తెలంగాణలో టీడీపీ క్యాడర్ ను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. అందుకే ఏ సభలో ప్రసంగించిన కాంగ్రెస్ కంటే టీడీపీ భజనే రేవంత్ చేస్తున్నారు..”

మోసపోతే గోస పడతాం అని, పెద్దాయన కేసీఆర్ అప్పుడే చెప్పిండు.ఆరు దశాబ్దాలు మోస పోయి గోసపడ్డాం అప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ నమ్మితే మోసపోతామని కేసీఆర్‌ అనేక సందర్భాల్లో చెప్పారు..అసెంబ్లీ ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్‌ కన్నింగ్‌ రాజకీయాలపై కళ్లు పెద్దగా చేసుకుని విజ్ఞతను ప్రదర్శించాని బీఆర్ఎస్‌ అధినేత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ నాడు కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మలేదు..కేసీఆర్ ఇచ్చిన దానికి రెండింతలు ఇస్తామని నమ్మించిన కాంగ్రెస్‌ ఉచ్చులు ప్రజలు పడ్డారు.ఆశపడి కొందరూ, తమ రాజకీయ ప్రయోజనాలు కేసీఆర్‌ నెరవేర్చలేదని ఇంకొందరు బీఆర్ఎస్‌పై తప్పుడు ప్రచారం చేశారు.ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలించారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న కాంగ్రెస్‌ గొంతు కోస్తుందని, గోసపడుతామని ఆనాడు కేసీఆర్‌ చెప్పింది ఇప్పుడు నిజమైంది.నాడు మోసపోయి నేడు తెలంగాణ గోసపడుతోంది.కేసీఆర్‌ చెప్పిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

కత్తి మనదే కన్ను మనదే మన కత్తితో మన కన్నే పొడిపించే కుట్రలు జరుగుతున్నాయని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ చెప్పారు.ఇప్పుడు అదే కనిపిస్తుంది. కాంగ్రెస్‌ గెలిపిస్తే అధిష్టానం తెలంగాణ వ్యతిరేకిని, ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన ద్రోహిని సీఎం సీట్లో కూర్చోబెట్టింది. చంద్రబాబుతో అధిష్టానం చీకటి ఒప్పందం చేసుకుని రేవంత్‌ను ముఖ్యమంత్రిని చేసింది.కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబు తనదైన స్టైల్‌లో హైకమాండ్‌ను వెన్నుపోటు పోడిచారు.తెలంగాణలో తన టార్గెట్‌ పూర్తి కాగానే బీజేపీ పంచన చేరాడు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా పాలన మాత్రమే తెలుగుదేశం కాంగ్రెస్‌ చేస్తుంది. సీఎం నుంచి కీలక నేతలు మంత్రలు వరకూ కొంత మందిలో ఇంకా టీడీపీ వాసనలు ఉన్నాయి.సీఎం రేవంత్‌ రెడ్డి అయితే పక్క పచ్చ పార్టీ సీఎంగానే వ్యవహరిస్తున్నారు.దేశం కాంగ్రెస్‌లో ఉన్న ఆత్మమాత్రం చంద్రబాబుదే.అది అనేక సందర్భాల్లో బయటపడుతూనే ఉంది.తెలుగుదేశం ప్రతినిధిగా కాంగ్రెస్ సీఎంగా తెలంగాణలో రేవంత్‌ వ్యవహరిస్తున్నారు. ఇది ఓపెన్‌ సీక్రెట్‌.

ఏ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా తెలుగువాడి ఆత్మగౌరవంతో టీడీపీకి ఎన్టీఆర్‌ పురుడు పోసిండో. ఏ జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ టీడీపీ పుట్టిందో.ఇప్పుడు అదే జాతీయ పార్టీకి సీఎంగా ఉంటున్న రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ కు రాష్ట్రంలో సమాధి కట్టుతున్నారు. నిజానికి కాంగ్రెస్‌ కోసం పని చేయడం లేదు..అలా అని ఎన్టీఆర్‌ మీద గౌరవం లేదు..కేవలం ఎన్టీఆర్‌ పేరుతో తెలంగాణలో టీడీపీని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు నేతృత్వంలోనే జరుగుతుంది. తెలంగాణలో టీడీపీని బతికించేందుకు అన్నాగారి మీద తుపాకీ పెట్టి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారు. నిజంగానే ఎన్టీఆర్ పై రేవంత్ రెడ్డికి అంత అభిమానం ఉంటే, ఏ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీ పెట్టారో ఆ పార్టీలో ఉండాలి.. కాంగ్రెస్ కు, సీఎం పదవికి రాజీనామా చేసి టీడీపీలో తిరిగి చేరాలి..అలా కాకుండా కాంగ్రెస్ లో ఉంటూ ఎన్టీఆర్ చంద్రబాబు భజన చేయడం అంటే కాంగ్రెస్ ను అవమానించడమే అవుతుంది.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు సమాధి కట్టేందుకే గురుశిష్యులు కుట్రలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం.

రేండేళ్ళుగా రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య సంబంధాలు బయట పడుతున్నా తాజాగా మరోసారి ఖమ్మం కేంద్రంగా బయటపడింది..ఇన్నీ రోజులు ముసుగులో ఉన్న రేవంత్ రెడ్డి ఈ సభలో తొలగించుకున్నారు. తాను కాంగ్రెస్ సీఎం అయినా టీడీపీ కార్యకర్తను, చంద్రబాబు విధేయుడిని అన్నట్లు రేవంత్ మాట్లాడారు. ఖమ్మం సభలో కాంగ్రెస్ కంటే ఎక్కువ టీడీపీని, చంద్రబాబును ఆకాశానికెత్తి తన ఆలోచనల ఏంటో చెప్పుకనే చెప్పారు. సీఎం ఎక్కడికి పోయినా కాంగ్రెస్ కంటే ఎక్కువ టీడీపీని ఆకాశానికి ఎత్తుతున్నారు..ఖమ్మంలో టీడీపీ ప్రభావం కాస్తా ఎక్కువ ఉండటంతో సభలో మరింత పచ్చ బానిసత్వాన్ని ప్రదర్శించారు.. బీఆర్ఎస్ ను టార్గెట్ చేసే అత్యుత్సాహంలో రేవంత్ చంద్రబాబు కుట్రలు బయటపెట్టున్నారు.. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను టీడీపీ ఎలా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందో అది చెప్పకుండా, కేవలం తెలంగాణలో టీడీపీని కేసీఆర్ లేకుండా చేసిండంటూ కాంగ్రెస్ ను ప్రొటెక్షన్ చేసే విధంగా కాకుండా కాంగ్రెస్ లో ఉండి టీడీపీని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణను అస్థిరపర్చాలని చంద్రబాబు నాయుడు కుట్రలు చేశారు.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి పడగొట్టాలని చూశారు.. ఏకంగా ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలు చేసి వోటుకు నోటు కేసు లో అడ్డంగా దొరికాడు. అప్పుడు కదా వెన్నుపోటు దారుడు, కుట్రదారులతో తెలంగాణకు నష్టం జరుగుతుందని టీడీపీ, కాంగ్రెస్ ఎల్పినీ బీఆర్ఎస్ లో రాజ్యాంగ బద్దంగా విలీనం చేసింది. టీడీఎల్పీ టీఆర్ఎస్లో కలిసిన తర్వాత కూడా టీడీపీ నేతలను కార్యకర్తలను కేసీఆర్ వేధించలేదు.. తెలంగాణను అస్థిరపర్చాలన్న తన కుట్రలు భగ్నం కావడంతో చంద్రబాబు ఏపీకి పారిపోయాడు. నాయకుడు లేని సైన్చెయం ల్లాచెదురైనట్లు తెలంగాణ టీడీపీ క్వాడర్ అయిపోయింది.. కేసీఆర్ ఏపీ టీడీపీని టార్గెట్ చేశారు కానీ, టీటీడీపీని ఏనాడు టార్గెట్ చేయలేదు. తెలంగాణ ప్రజల అభిప్రాయాలను, అభిరుచులకు, ఆకాంక్షలకు ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందు ప్రజలు కర్రుకాచి వాత పెట్టారు.. తెలంగాణలో టీటీడీపీని భూస్థాపితం చేసారు.

ఖమ్మం సభలో మరోసారి రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు బంధం బయటపడింది..వారి చీకటి బంధమే కాదు, మళ్ళీ తెలంగాణపై వారిద్దరూ చేస్తున్న కుట్రలు ఖమ్మం సాక్షిగా బయటపడ్డాయి…తెలంగాణ సాధించిన వ్యక్తిపై చిల్లర కూతలు కూశారు, తెలంగాణ ద్రోహుల భజన చేశారు.. కనీసం సొంత పార్టీని గురించి గొప్పగా చెప్పుకోకుండా టీడీపీ చంద్రబాబు భజన చేశారు..తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని గ్రహించిన రేవంత్ రెడ్డి టీడీపీని పునర్వ్యవస్థీకరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు రేవంత్ ప్రసంగాన్ని గమనించిన వారు విశ్లేషిస్తున్నారు..ఖమ్మం సభ కాంగ్రెస్ బలోపేతం కోసం కాకుండా టీడీపీ బలోపేతానికి పెట్టినట్లుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అటు తెలంగాణలో కాంగ్రెస్ కు సమాధి కట్టుతూ టీడీపీకి పునాది వేసి చంద్రబాబు తెలంగాణలోకి రీఎంట్రీ కోసం ఖమ్మం సభతో మార్గం వేసినట్టు రేవంత్ స్పీచ్ ఉందని ఒరిజినల్ కాంగ్రెస్ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు ను అంధకారంలోకి నెట్టుతుందని, రేవంత్ ,బాబు బంధంపై కమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు వర్జినలై కాంగ్రెస్ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

నిజానికి ఖమ్మం లో సీఎం రేవంత్ రెడ్డి చాలా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ కు నష్టం చేసేలా మాత్రమే కాదు టీడీపీకి లాభం జరిగేలా చేశారు..నిజానికి తెలంగాణ టీడీపీ లేదు.. క్యాడర్ ఉన్న లీడర్ లేడు.. రేవంత్ రెడ్డినే వారికి నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ క్యాడర్ కు సీఎం పిలుపునివ్వాలి..కానీ బీఆర్ఎస్ ను ఓడించేందుకు టీడీపీ క్యాడర్ కు పిలుపు నిచ్చారు.. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతమైందని, ఓటమి ఖాయమైంది బహుశా రేవంత్ అభిప్రాయానికి వచ్చినట్లున్నారు.. లేకపోతే సొంత క్యాడర్ కు కాకుండా కాంగ్రెస్ ను సమాధి చేసేందుకు పుట్టిన టీడీపీ క్యాడర్ కు ఎందుకు రేవంత్ పిలుపు నిస్తారు. రేవంత్ రెడ్డికి భవిష్యత్తు క్లారిటీ వచ్చింది.. కాంగ్రెస్ లో ఉంటే ఫ్యూచర్ లేదని, ఏపీ చంద్రబాబుతో తెలంగాణలో మళ్ళీ రేవంత్ టీడీపీని బలోపేతం చేసి సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఖమ్మం ప్రసంగం స్పష్టం చేస్తుంది.. తెలంగాణలో బీఆర్ఎస్ ను బలహీనపర్చేందు బాబు రేవంత్ ఎంత ప్రయత్నించినా ఎన్ని కుట్రలు చేసినా వాటన్నింటినీ బద్ధలు కొట్టుతు బీఆర్ఎస్ రోజు రోజుకు బలపడుతోంది..అదే సమయంలో కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీని చీల్చే ప్రయత్నం, నేతలపై తప్పుడు ప్రచారం చేయిస్తూ దినం దినం కాంగ్రెస్ ను రేవంత్ బలహీనర్చుతున్నారు..

.దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు..బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చే సూచనలు కనిపించడంలేదు..ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పై భవిష్యత్తు ఆశలు సన్నగిల్లుతుండటంతో రేవంత్ ప్రత్యామ్నాయ మార్గాలను ఎందుకునే క్రమంతో టీడీపీని బలోపేతం చేసే వ్యూహ రచన చేశారు.. కాంగ్రెస్ తో రేవంత్ కు ప్రమాదం లేదు.. బీజేపీ హైకమాండ్ తో మొదటి నుంచి సఖ్యతగానే ఉంటున్నారు..బడే భాయ్ అంటూ భుజాలు కలుపుతున్నారు..ఉన్న సవాలల్ల బీఆర్ఎస్ తోనే.. అందుకే బీఆర్ఎస్ ను ఎదుర్కొనడం ఒక్క కాంగ్రెస్ వల్ల కాదు, గత అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతుగా నిలబడ్డా ప్రజా సంఘాలు, విద్యార్థి నిరుద్యోగులు వచ్చే ఎన్నికల్లో మద్దతుగా నిలబడే అవకాశం అస్సలు లేదు.. కాంగ్రెస్ ను గెలిపించిన తప్పుకు ఇప్పటికే పశ్చాత్తాపం పడుతున్నారు.

గ్రౌండ్ లో పెరుగుతున్న ప్రజా వ్యతిరేక, కాంగ్రెస్ కు అన్ని వర్గాలు దూరం కావాడాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ కంటే టీడీపీ ఎదుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నారు..సమావేశం ఏదైనా, సమీక్ష ఏదైనా చంద్రబాబు ఆదేశాలతో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు రేవంత్ కృషి చేస్తున్నారు.అందుకే రాష్ట్రంలో ఏ జిల్లా పర్యటనకు పోయిన అక్కడ పాత టీడీపీ నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ నడుస్తోంది. అంతేకాదు రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు పాత టీడీపీ, కొంత పారాష్యూట్ కాంగ్రెస్ నేతలను ఏకం చేస్తున్నారు..ఎలాగూ ఎన్డీయే కూటమిలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు..ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని తెలంగాణలో టీడీపీ బలోపేతానికి అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ క్యాడర్ కు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.. అటు టీటీడీపీకి భవిష్యత్తు లీడర్ తానే అన్న సంకేతాలు కూడా టీటీడీపీ క్యాడర్ కు రేవంత్ ఇస్తున్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.. పొత్తులతో తప్ప బీజేపీ గెలవలేదు.. అందుకే వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన బీజేపీ కలిస్తే గెలవ వచ్చన్న ఉద్ధేశ్యంతో రేవంత్ పదేపదే తెలంగాణలో టీడీపీ క్యాడర్ ను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. అందుకే ఏ సభలో ప్రసంగించిన కాంగ్రెస్ కంటే టీడీపి భజనే రేవంత్ చేస్తున్నారు.

.. ఈనేపథ్యంలో బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఏకం కావాలని టీడీపీకి రేవంత్ పిలుపు ఇస్తున్నారు. ఎలాగు కాంగ్రెస్ పార్టీలో ఉండే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలను ఏకం కావాలని పిలుపునివ్వడం లేదు. అంతేకాదు .కాంగ్రెస్‌ సీఎంగా ఉంటూ టీడీపీ పార్టీ కోసం పని చేస్తున్నారు.. కాంగ్రెస్ బలపడితే టీడీపీ కి బీజేపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదు..పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుంది.. అందుకే పోటీ నుంచి కాంగ్రెస్ ను తప్పించి, ఆ స్థానాన్ని టీడీపీ బీజేపీ కూటమి అక్రమించేందుకు చంద్రబాబు మోదీ స్కేచ్ గీస్తే రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు.

..ఈ క్రమంలోనే తెలంగాణలో రేవంత్ రెడ్డి టీడీపీ క్యాడర్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ గద్దెలను కూల్చాని పిలుపునిచ్చారు..కాంగ్రెస్‌ను సమాధి చేసేందుకే టీడీపీ పుట్టింది.ఇప్పుడు తెలంగాణలో రేవంత్‌ రెడ్డి అదే చేస్తున్నారు..కాంగ్రెస్‌ను సమాధి చేస్తూ టీడీపీకి రేవంత్ ప్రాణం పోస్తున్నారు..తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న చంద్రబాబ స్పై రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ మొత్తం కుట్రలకు బీజేపీ ప్రత్యేక్షంగా సహకరిస్తుంది. నేడు రేవంత్ తెలంగాణ విధ్వంసంలో పాత మిత్రులు , తెలంగాణ ద్రోహుల పార్టీలతో చేతులు కలిపి ప్రతి పక్షాల గద్దెలు కూల్చడంతో భాగస్వామ్యం కావాలి రేవంత్ పిలుపునిస్తున్నారు…గద్దెలను గద్దెలుగానే చూస్తే అవి కాంగ్రెస్ పార్టీకి సమాధులవుతాయి..ఏ గద్దెలకైనా ఒక నేపథ్యం ఉంటుంది..అవి గద్దెలు మాత్రమే కాదు, పార్టీ ఎజెండాను మోసే ద్వజస్తంభాలు.. అలాంటిది పార్టీల గద్దెలు కూల్చడమంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే అవుతుంది.. ప్రజాస్వామ్యాన్ని కూల్చడం అవుతుంది.

ఒకవైపు రాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేకులు విగ్రహాలు పెడుతున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన పార్టీ గద్దెలు కూల్చాలని అందులోనూ టీడీపీ వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నివ్వడం అంటే రేవంత్ ఎవరి ప్రయోజనాలు కోసం తెలంగాణలో పని చేస్తున్నారో.ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం కాంగ్రెస్ ను సమాధి చేస్తూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.బీఆర్ఎస్ పై తుపాకీ పెట్టి కాంగ్రెస్ ను కాల్చే ప్రయత్నం వెనుక ఆదేశించిన అదృశ్య శక్తి ఎవరు..?.

.బీఆర్ఎస్ గద్దెల వెనుక కోట్లాదిమంది తెలంగాణ ప్రజల నమ్మకం ఉంది..వందల మంది అమరుల ఆశయాలు, ఆత్మ బలిదానాలున్నాయి..వేలాది మంది ఉద్యమకారుల ఆకాంక్షలున్నాయి..వాటి నిర్మాణం వెనుక ఒక ఆత్మగౌరవం ఉంది. తెలంగాణ అస్తిత్వం ఉంది.అవి గద్దెలు మాత్రమే కాదు.. తెలంగాణ ఉద్యమ అస్థిత్వ చిహ్నాలు.. అస్థిత్వ పోరాటంలో, ఆత్మ గౌరవ పోరాటంలో..మా రాజ్యంలో మాదే పాలన అంటూ రాజ్యాలను రాజులను ధిక్కరించి, పోరులో ఒరిగిన ఆదివాసులు సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజుల గద్దెలకున్న నేపథ్యం ఉంది, నూతన సమాజ స్థాపన కోసం రాజ్యంతో పోరులో అమరులైన వీరుల స్థూపాలకున్న చరిత్ర బీఆర్ఎస్ గద్దెలకుంది.వాటిని కూల్చడం అంతే ఈజీ కాదు.. వాటిని టచ్ చేసే ప్రయత్నం చేస్తే మాడి మసైతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *