హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17ః శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో ఆమెకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. హకీంపేట నుండి ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. రాష్ట్రపతి తన పర్యటనలో భాగంగా ఈ నెల 22 వరకు ఇక్కడే బస చేస్తారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఛైర్మన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభిస్తారు. శుక్రవారం బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ 21వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే భారత కాలాతీత జ్ఞానం- శాంతి పురోగతికి మార్గాలు అనే సదస్సులో ఆమె ప్రసంగిస్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



