రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 26న గ్రామ సభలు

– కేంద్రం ఆదేశాలతో ఏఐ ఆధారిత ‘సభా సార్‌’ అమలు
– గ్రామ సభల డిజిటలైజేషన్ కు కొత్త‌ ప్లాట్‌ఫామ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24 : కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గ్రామ సభల డాక్యుమెంటేషన్‌ను డిజిటల్‌గా మార్చేందుకు ‘సభా సార్’ (ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్)ను ప్రవేశపెట్టింది. 2025 ఆగస్టు 14న ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్ ఆడియో/వీడియో రికార్డింగ్‌ల నుంచి బహు భాషల్లో ఆటోమేటిక్‌గా సమావేశ మినిట్స్‌ను రూపొందించే సౌకర్యం కలిగి ఉంది. దీనివల్ల శ్రమ తగ్గి, పారదర్శకత, సామర్థ్యం పెరుగుతాయి. రిపబ్లిక్ డే సందర్భంగా 26న నిర్వహించనున్న ప్రత్యేక గ్రామ సభల్లో ఈ ‘సభా సార్ ’ https://sabhasaar.panchayat.gov.in ప్లాట్‌ఫామ్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు తమ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ‘సభా సార్ వినియోగంపై ఆదేశాలు జారీ చేయాలని కమిషనర్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ డైరెక్టర్ శృతి ఓఝా ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల పరిపాలనా భారం తగ్గి, గ్రామ సభల చర్చల సమగ్ర రికార్డులు డిజిటల్‌గా మారి సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *