వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 20: స్వయంప్రతిపత్త కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ 2021-2025 సంవత్సర బ్యాచ్ విద్యార్థుల 42వ గ్రాడ్యుయేషన్ డేను ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు, కళాశాల గవర్నింగ్‌బాడీ చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు ఒక ప్రకటనలో తెలిపారు. కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో 8వ అటానమస్ బ్యాచ్ 42వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు జరుపుకుంటుందని, అకడమిక్ అండ్ కో కరికులర్ కార్యక్రమాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 28మంది విద్యార్థులకు బంగారు పతకాలు, అకడమిక్ మెరిట్ అవార్డులు, డిగ్రీలు బీటెక్, ఎంటెక్, ఎంబీఏ గ్రాండ్ అంట్స్‌కు అందజేస్తామని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి, గౌరవ అతిథిగా కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం హాజరవుతారన్నారు. కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారన్నారు. కోశాధికారి పి.నారాయణ రెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వి.సతీష్ కుమార్ అతిథులుగా హాజరవుతారు. కార్యక్రమానికి కిట్స్ యాజమాన్య కమిటీ సభ్యులు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్‌రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి.రమేష్ రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ వి.రాజగోపాల్, అకడమిక్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ కె.వేణుమాధవ్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి.కిరణ్ కుమార్, డాక్టర్ ఎస్.ఉమామహేశ్వర్, డాక్టర్.డి.రాజయ్య, యూజీ, పీజీ కోర్సుల ఫ్యాకల్టీ ఇన్‌చార్జిలు డాక్టర్ పి.నాగార్జున రెడ్డి, డాక్టర్ ఆర్.శ్రీకాంత్, వివిధ విభాగాల డీన్లు, వివిధ విభాగాల అధిపతులు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.ప్రభాకరాచారి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరవుతారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





