– మంత్రి సీతక్కను కోరిన పంచాయతీ సెక్రటరీస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: గ్రామ పంచాయతీల గ్రేడింగ్, కేడర్ స్ట్రెంత్ వెంటనే నిర్ధారించి ప్రమోషన్‌లు కల్పించాలని తెలంగాణా పంచాయతీ సెక్రటరీస్ సెంట్రల్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు సందిల బలరాం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కను కోరారు. ఆయన మంగళవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. జీవో 17లో స్థానికత కోల్పోయిన వారందరినీ జీవో 190 ద్వారా గ్రేడ్‌లతో సంబంధం లేకుండా జోన్‌లతోపాటు అంతర్గత జోన్‌లో కూడా సొంత జిల్లాలకు బదిలీ చెయ్యాలని కోరారు. అలాగే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగేళ్ల కాలాన్ని సర్వీస్‌గా పరిగణించాలని, ఓపీఎస్‌గా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ ఓపీఎస్ వ్యవస్థ పూర్తిగా రద్దు చెయ్యాలని కూడా కోరారు. పై సమస్యలకు సానుకూలంగా స్పందించి. మంత్రి సీతక్క త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా ఆదేశాలు జారీ చేస్తానని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





