గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీల ఎంపికకు నో అబ్జెక్షన్‌

– ‌సుప్రీం కోర్టు

న్యూదిల్లీ, ఫిబ్రవరి3: తెలంగాణలో గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఎమ్మెల్సీల ఎంపికకు అడ్డంకిగా తమ ఉత్తర్వులు లేవని తేల్చి చెప్పింది. గతేడాది ఆగస్టు 13 నాటి మధ్యంతర ఉత్తర్వుల్లోనే స్పష్టంగా చెప్పామని జస్టిస్‌ ‌విక్రంనాథ్‌ ‌ధర్మాసనం తెలిపింది. కేబినెట్‌ ‌నిర్ణయానికి అనుగుణంగా గవర్నర్‌ ‌నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. తమ ఎన్నికపై జారీ చేసిన ఉత్తర్వులు ఎత్తివేయాలని అమిర్‌ అలీ సుప్రీంకోర్టులో వెకేట్‌ ‌పిటిషన్‌ ‌వేశారు. అమిర్‌ అలీ పిటిషన్‌ను దాసోజు శ్రవణ్‌ ‌వేసిన ప్రధాన పిటిషన్‌తో జత చేస్తూ ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణని ధర్మాసనం మార్చి 19కి వాయిదా వేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *