– ఆర్థిక బిల్లులును కూడా అడ్డుకోవచ్చు
– ఇది సమస్యాత్మ అంశమని ‘సుప్రీమ్’ అభిప్రాయం
న్యూదిల్లీ, ఆగస్ట్ 26: గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 200 ప్రకారం బిల్లులను ఆపే అధికారం గవర్నర్‌కు ఉంటే.. మనీ బిల్లులను ఆపే అధికారం కూడా గవర్నర్‌కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ అంశం కొంత సమస్యాత్మకమనేనని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. బిల్లులకు గవర్నర్లు ఆమోదం ఇవ్వకుండా వీటో చేస్తే.. వారు మనీ బిల్లులను కూడా అడ్డుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. సుప్రీం ధర్మాసనం అభిప్రాయంతో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఏకీభవించారు. బిల్లుల ఆమోదం అంశంలో గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించడంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. బిల్లులను 3 నెలల గడువులోగా గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదించాలంటూ గతంలో జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై దుమారం రేగింది. దీంతో రాష్ట్రపతి దౌపది ముర్ము 12 సందేహాలను లేవనెత్తారు. రాజ్యాంగంలో లేని అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పులు ఎలా ఇవ్వగలదని అపెక్స్ కోర్టుకు 12 ప్రశ్నలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీజైఐ బీఆర్ గవాయ్, న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్‌నాథ్, పీఎస్ నరసింహా, ఏఎస్ చందూర్‌కర్‌తో కూడిన రాజ్యాంగ ధర్మసనం మంగళవారం నాడు విచారణ జరుపుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





