– రుద్రాభిషేకం, కుంకుమార్చనలో పాల్గొన్న గవర్నర్
- కన్నడ భక్తుల రాకతో కిటకిటలాడుతున్న క్షేత్రం
శ్రీశైలం ,మార్చి 14:శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శనివారం తెల్లవారు జామున తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్‌శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఈవో ఎం.శ్రీనివాసరావు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గవర్నర్ దంపతులకు దేవస్థానం అర్చకులు, పండితులు వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈవో వారికి స్వామి అమ్మ వార్ల చిత్రపటాలను అందజేశారు. శ్రీశైల క్షేత్ర విశేషాల గ్రంథాన్ని గవర్నర్‌కు ఈవో బహూకరించారు. గవర్నర్‌గా నియమితులు అయ్యాక శుక్లా శుక్రవారం శ్రీశైలం చేరుకున్నారు. వేకువ జామునే ఆయన ఆలయం చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇదిలావుంటే శ్రీశైలంలో భారీగా రద్దీ పెరగింది. వరు సెలవులకు తోడు కన్నడ భక్తుల రాకతో శ్రీశైలం కిటకిటలాడుతోంది.
————————————————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





