– లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మార్చి 12: రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి పుణ్యక్షేత్రాన్ని గురువారం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. పభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డిలు ఆయనకు పూల మొక్కలు బహూకరించి స్వాగతం పలికారు. తొలుత గవర్నర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి భావానీశంకర్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు, వేద పండితులు ఆలయ సంప్రదాయంతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్ ధ్వజ స్తంభం వద్ద మొక్కి స్వామి వారి అంతరాలయం లో అర్చన నిర్వహించారు. ఈవో భవానీశంకర్ గవర్నర్‌కు స్వామి వారి మెమెంటోను అందజేయగా ఆలయ అనువంశిక ధర్మకర్త స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం గవర్నర్ దంపతులు అనుబంధ దేవాలయం శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్ఫటిక లింగానికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





