గ్రామాలు ఆరోగ్యంగా వుండాలి

– ప్రతీ మహిళ నాయ‌కురాలిగా ఎద‌గాలి
– స‌మాజం ప్లాస్టిక్ ర‌హితంగా మారాలి
– ఎస్‌హెచ్‌జి ఒక ఉద్య‌మం
– గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌

కోహెడ‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 17:  మానవ సేవ చేసే అవకాశాలు జీవితంలో అరుదుగా వస్తాయి. నాకు రాజ్ భవన్ లో పొన్నం ప్రభాకర్ భర్తన్ బ్యాంకు గురించి చెప్పినపుడు చాలా నచ్చింది. మహాత్మా గాంధీ చెప్పినట్లు, సంపూర్ణ స్వాతంత్య్రం  గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే వస్తుంద‌ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ అన్నారు. ఆయ‌న గురువారం మంత్రి హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం, కోహెడ‌లో  పొన్నం ప్ర‌భాక‌ర్ తండ్రి పొన్నం స‌త్త‌య్య ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో 38 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్‌ ల‌ను పంపిణీ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  గ్రామాలు ఆరోగ్యంగా ఉంటేనే, మనం దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు.  నేటికి అత్యధిక జనాభా గ్రామీణ ప్రాంతాలలోనే నివసిస్తున్నారు.   ఈ బర్తన్ బ్యాంకు చిన్న పనే అయిన, అది భవిష్యత్ కి బాట‌లు వేస్తుంది.  దీని ప్రభావం ఆటోమొబైల్, ఐటీ విప్లవం కంటే కూడా గొప్పద‌న్నారు.   ఎందుకంటే ఇది మన ఆరోగ్యం కోసం చేప‌ట్టిన  కార్యక్రమం అన్నారు. ప్లాస్టిక్ ఉంటే, మన పరిసరాలు పచ్చదనంగా ఉండదు. ప్ర‌తి మ‌హిళ నాయ‌కురాలిగా ఎద‌గాలి.  సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే కేవలం ఒక చిన్న గ్రూప్ కాదు, అధిక విప్లవం. భారత దేశ మహిళా శక్తి విప్లవం అది. ఎస్‌హెచ్‌జీ ఉద్యమం, మహిళా సాధికారత ఉద్యమం. ఈ కార్యక్రమం తెలంగాణలో ఊపందుకుంటుంది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ మహిళల శక్తి సామర్ధ్యాలు చూసాను. మానవ సేవ చేయాలని సంకల్పించినపుడు అదొక ఉద్యమంగా మారుతుంది.  మంత్రి పొన్నం ప్రభాకర్ కు  అభినంద‌న‌లు తెలిపారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ  ఇక్కడ 160 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లోని .  270 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేస్తున్నాం. అందులో 500,400,300 కిట్స్ ఉన్నాయ‌న్నారు. ఇటీవల రాజ్ భవన్ లో అందాల పోటీలు కార్యక్రమంలో బోజన సమయంలో ప్లాస్టిక్ రహిత కార్యక్రమం చేప‌ట్టారు.  ఎమ్మెల్యే గా గెలిచే నాటికి ఈ జిల్లా ఆదర్శంగా ఉండాలని స్టీల్ బ్యాంక్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.  నా నియోజకవర్గం లో ఎవరు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలని స్టీల్ బ్యాంక్ పంపిణీ కార్యక్రమం చేపట్టామ‌న్నారు. 340 హోటల్ లలో 3400 స్టీల్ గ్లాస్ లు పంపిణీ చేశాం. 74 వేల రైస్ ప్లేట్స్ ఈ నియోజకవర్గంలో సప్లై చేస్తున్నాం. నియోజకవర్గం ప్లాస్టిక్ రహితంగా ఉండాలని అధికారులను భాగస్వామ్యం చేస్తూ ప్లాస్టిక్ నిషేధించేలా స్టీల్ బ్యాంక్ పంపిణీ కార్యక్రమం చేపట్టామ‌న్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ  రోడ్ల మీద ఎక్కడ చెట్టలేకుండా జాగ్రత్త చర్యలు తీసుకుం టున్నామ‌న్నారు.  ప్లాస్టిక్ ను దూరం పెడితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్లాస్టిక్ ను దూరం పెట్టేలా మంత్రి పొన్నం ప్రభాకర్ స్టీల్ బ్యాంక్ పంపిణీ కార్యక్రమం చేపట్టాడం గొప్ప విషయం. పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి.  ప్లాస్టిక్ మనకు ఇబ్బందులు వస్తాయి కాన్సర్ తో పాటు ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.  కరోనా తరువాత ఆరోగ్యం మీద చాలా అవగాహన వచ్చింది.  ఒకే సారి 70 వేల మంది తినేలా ఈరోజు స్టీల్ బ్యాంక్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.  మన కంటే ముందు తరం వారు చాలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నారు. వారు  చాలా ఆరోగ్యంగా ఉన్నారు. గతంలో మన బంధువులు ఎవరైనా ఇంటికి వస్తె కాళ్ళు కడుక్కోమని చెప్పేవారు మంచి పద్ధతులు ఉండేవి.. పాత తరం పద్ధతులు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది.  ప్లాస్టిక్ వందల సంవత్సరాలు భూమిలో కలిసిపోవు.  భూమి ,నీటి కాలుష్యాన్ని చేస్తాయి.. మురుగు నీరు వెళ్లకుండా అడ్డుపడుతుంటాయి.  మీ ఆకలి తన ఆకలి అనుకొని సేవ చేసే వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్నారు.  వారి నాన్న పేరు మీద స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు . మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేయటం దూర‌దృష్టితో ఆలోచించి తీసుకున్న నిర్ణ‌యం. ఇది వేల కుటుంబాల ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుంది. ఇక నుండి ప్లాస్టిక్ మేము ముట్టుకోము అని మహిళలకు ప్రమాణం చేయాల‌న్నారు. పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 276 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ నిర్వహణ బాధ్యతలు అప్ప‌గించారు. ఇక నుండి పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తగ్గించి స్టీల్ సామాగ్రి వాడకం తప్పని సరి చేసేలా వినూత్న కార్యక్రమం.స్టీల్ బ్యాంక్ లో టిఫిన్ ప్లేట్స్ &,లంచ్ ప్లేట్స్ ,వాటర్ & టీ గ్లాస్ లు , కప్స్ & డిష్ లు ,బకెట్లు , చెంచాలు ,వంటలకు అవసరమైన గిన్నెలు తదితర వస్తువులున్నాయి. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య , దివ్యా దేవరాజన్ సేర్ఫ్ సీఈవో, దాన కిషోర్ క లెక్టర్ లు హైమవతి, పమేలా సత్పతి , స్నేహ శబరిష్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *