– క్షయ నియంత్రణకు జిల్లా యంత్రాంగం కృషి అభినందనీయం
– చేనేత రంగానికి గుర్తింపు తెచ్చేలా కృషి చేయాలి
– రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
వనపర్తి ప్రజాతంత్ర డిసెంబర్ 23: సమాజంలో అట్టడుగు వర్గాల వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందాలని, బలమైన సమాజాన్ని నిర్మించినప్పుడే బలమైన దేశం తయారవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రధానమంత్రి కలలు కంటున్న వికసిత్ భారత్ లక్ష్యం సా ధించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క రూ విద్య, వైద్యం, ఆర్థికంగా సాధికారత సాధించాలన్నారు.మంగళవారం వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం సమా వమందిరంలో జిల్లా అధికా రులు, వివిధ రంగాల ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పర్యటనకు విచ్చేసి న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) భీమ్య నాయక్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యాదయ్య సాదర స్వాగతం పలికారు. కలెక్టరేట్ ఆవరణలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అక్కడే ఏర్పాటు చేసిన స్టాల్స్, విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలను తిలకించారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, గవర్నర్ స్పెషల్ సెక్రటరీ భవాని శంకర్, ఎస్.పి.డి. సునీతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో కవులు, కళాకారులు, రచయితలు, వివిధ రంగాల ప్రముఖులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. క్షయ రహిత సమాజాన్ని నిర్మించాలన్నా, బాల్యవివాహాలను నిర్మూలించాలన్నా కవులు, కళాకారులు, రచయితల గళం ఎంతో కీలకమన్నారు. ప్రత్యక్షంగా పరస్పర మానవ సంబంధాలతోనే సమాజంలో సాధికారత సాధ్యమవుతుందని తెలియజేశారు. వనపర్తి జిల్లాలో క్షయ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ ఉండాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం హెల్త్ యాప్ని సృష్టించడం చాలా అద్భుతమని గవర్నర్ కొనియాడారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జిల్లా ప్రొఫైల్ తో పాటు, జిల్లాలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ కు వివరించారు. జిల్లాలో విద్య, వైద్యం, మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న అనేక కార్య క్రమాల గురించి కూడా వివరించారు. క్షయ రహిత జిల్లాగా తీర్చిదిదేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలను వివరించారు. అదేవిధంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ మధుమేహ, మిషన్ మధుమేహ దృష్టి కార్యక్రమాలను వాటి లక్ష్యాలను వివరించారు. పీఎం శ్రీ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న కార్యక్రమాలు, అన్ని పాఠశాలల్లో వంట కోసం చేప ట్టిన గ్యాస్ సిలిండర్ కనెక్షన్స్ కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు. వనపర్తి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు జిల్లా కలెక్టర్ శ్రీరంగాపురం చిత్రపటం, మెమెంటోతో సత్కరించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో గవర్నర్ మొక్కను నాటారు. గవర్నర్ తో జిల్లా అధికారులు, ప్రముఖులు ఫోటో దిగారు. జిల్లాకు చెందిన విద్య, వైద్యం, క్రీడలు, రచనలు, సామాజిక సేవ వివిధ రంగాలలో 12 మంది ప్రముఖులు తమ తమ రంగాల్లో నిర్వహించిన సేవలను సమావేశంలో వివరిం చారు. జిల్లాకు చెందిన వివిధ రంగాల ప్రము ఖులు ఏ. దినకర్ బాబు విశ్రాంత ఐఏఎస్, పద్య కవి ఆకుల శివరాజ లింగం, పద్య కవి సందాపురం బిచ్చయ్య, కూచిపూడి నృత్యకా రిణి వంగిపురం నీరజాదేవి, విశ్వ మానవతా సంస్థ శ్రీనివాస అల్లూరి, ప్రభుత్వ ప్రధానోపా ధ్యాయురాలు పెరవల్లి గాయత్రి, శిల్పి భైరోజు చంద్రశేఖర్, సెపక్తక్రా అంతర్జాతీయ క్రీడాకా రిని రాళ్ల నవత, బాక్సింగ్ క్రీడాకారుడు నున్సా వత్ వెంకటేష్, పోచ రవీందర్ రెడ్డి, చిత్ర కారుడు గడ్డం శివకుమార్, జానపద కళాకారుడు రాజారాం ప్రకాష్ తమ పరిచయాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





