– గవర్నర్‌ను కోరిన పీసీసీ చీఫ్, మంత్రులు పొన్నం, సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, కెపి వివేకానంద గౌడ, సీపీ నేతలు నారాయణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు కలుసుకున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభలో ఆదివారం ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిందని వివరించారు. మూడ్ ఆఫ్ హౌజ్ పరిగణనలోకి తీసుకొని బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదించాలని గవర్నర్‌ను వారు కోరారు. అనంతరం అక్కడ వారంతా మీడియాతో మాట్లాడారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





