జాతీయ క్రీడా దినోత్సవం సైకిల్‌ ర్యాలీకి గవర్నర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈనెల 31న నిర్వహించనున్న సైకిల్‌ ర్యాలీ కార్యక్రమానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈమేరకు తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సోనీ బాలాదేవిలు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ను మంగళవారం కలిసి ఆహ్వానించారు. ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌ కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు గవర్నర్‌కు వివరించారు. ఆరోజు ఉదయం 7 గంటలకు గచ్చిబౌలి స్టేడియం మెయిన్‌ గేట్‌ వద్ద ర్యాలీ ప్రారంభం కానుందన్నారు. ఈ ఆహ్వానాన్ని గవర్నర్‌ సానుకూలంగా స్వీకరించారని వారు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *