రైతాంగ సాధికారతతోనే జాతీయ సమైక్యత బలోపేతం  

=రైతు ఉద్యమాలకు పటేల్ ఇచ్చిన ఊతం చిరస్మరణీయం
=మన జీవితాలను పేదలతో పంచుకోవడంలోనే ఆనందం
=’గీతం’ జాతీయ చర్చాగోష్ఠి ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: గ్రామీణ ప్రజలు, భారత రైతాంగ సాధికారతతోనే జాతీ య సమైక్యత బలోపేతమవుతుందని  రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని రాజకీయ శాస్త్ర (పొలిటికల్ సైన్స్) విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల ‘సర్దా ర్ వల్లభాయ్ పటేల్, రైతులు: చంపారన్ నుంచి చిత్రకూట్ వరకు’ జాతీయ చర్చాగోష్ఠిని సోమ వారం ఆయన జ్యోతి ప్రజ్వలనలతో లాంఛనం గా ప్రారంభించారు. భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి (ఐసీఎస్ఎస్ఆర్) సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం తరు వాత 562 సంస్థానాలను భారతదేశంలో విలీ నం చేయడంలో సర్దార్ పటేల్ అద్భుతమైన పాత్రను వివరించారు. రైతు ఉద్యమాలకు పటే ల్ చేసిన సేవలు అంతగా వెలుగులోకి రాలేద న్నారు. చారిత్రాత్మక బార్డోలి సత్యాగ్రహం (1928)లో పటేల్ నాయకత్వాన్ని, రైతులు, భూమి లేని కార్మికుల సాధికారత కోసం సర్దార్ పటేల్ చేసిన కృషిని గవర్నర్ ప్రత్యేకంగా ప్ర స్తావించారు. గ్రామీణ భారతదేశం జాతికి ఆత్మ గా మిగిలిపోతుందని చెప్పారు. రైతులు, జాతీ య ఐక్యత పట్ల పటేల్ దృక్పథంపై ఈ చర్చా గోష్ఠిలో విలువైన చర్చలకు దారితీస్తుందని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. మన జీవితా లను పేదలు, అణగారిన వర్గాలతో పంచుకోవడంలో ఆనందం ఉందని జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యానించారు. అంతకు ముందు, మహాత్మా గాంధీకి విగ్రహానికి పూలుచల్లి నివాళులు అర్పించి, ఆ తరువాత పోలీసుల నుంచి గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) స్వీకరించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ యొక్క విశిష్టతను గౌర వ అతిథి, గుజరాత్ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ డైరె క్టర్, ఐఏఎస్ అధికారి డాక్టర్ సంజయ్ జోషి వివరించారు. ఐక్యతా స్ఫూర్తిని పొందడం కోసం గుజరాత్ లో నెలకొల్పిన సర్దార్ పటేల్ స్మారక నివాళిని సందర్శించమని విద్యార్థులను జోషి ప్రోత్సహించారు. సామాజిక సమరస్థ మంచ్ జాతీయ కన్వీనర్ కె.శ్యామ్ ప్రసాద్ పటేల్ నాయకత్వం గురించి ప్రముఖంగా ప్రస్తావించడంతో పాటు, ఆయనపై రాజ్ మోహన్ గాంధీ రచించిన పుస్తక ప్రతులను వేదికపైను న్న ప్రముఖులకు బహుకరించారు.గీతం హైద రాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు స్వాగతోపన్యాసంలో అతిథులను సభకు పరిచయం చేయడంతో పాటు గీతం పురోగతిని సోదాహరణంగా వివరించారు. సెమినార్ కన్వీనర్ డాక్టర్ గుఱ్ఱం అశోక్ వంద న సమర్పణతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసింది.దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖ పండితులు, ఆలోచనాపరులు ఈ రెండు రోజుల జాతీయ చర్చాగోష్ఠిలో పాల్గొం టున్నారు. వీరిలో గుజరాత్ లోని సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వసంత్ కుమార్ ఆర్.పటేల్, తెలంగాణలోని ములుగులోని సమ్మక్క సారక్క గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్.శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం ఇంచార్జ్ రిజిస్ట్రార్ అండ్ డీన్ ప్రొఫెసర్ షీలా రెడ్డి; హైదరాబాద్ విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ జి.నాగరాజు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి, ఐసీఎస్ఎస్ఆర్ దక్షిణ ప్రాంత డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి, యూజీసీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ జి.గోపాల్ రెడ్డి తదితరులున్నారు.సర్దార్ పటేల్ రైతుల పట్ల చూపిన దార్శనికత, భారతదేశ గ్రామీణ, వ్యవసాయ పరివర్తనకు దాని ఔచిత్యంతో పాటు జాతీయ ఐక్యతను పెంపొందించడంలో దాని సహకారంపై చర్చించడానికి విద్యావేత్తలు, సామాజికవేత్తలు, పరిశోధకులకు ఈ సెమినార్ ఒక వేదికను అందిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *