– భవిత సెంటర్‌లో ఘనంగా దివ్యాంగుల దినోత్సవం
హనుమకొండ, ప్రజాతంత్రల, డిసెంబర్ 3: ప్రభుత్వం అందిస్తున్న వివిధ సదుపాయాలను దివ్యాంగ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్య అతిథులు సీడబ్ల్యూసీ కౌన్సెలర్ రజిత, సభ్యులు సుధాకర్, దామోదర్‌లు కోరారు. హనుమకొండలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా వనరుల కేంద్రం భవిత సెంటర్‌లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఎంఈవో నెహ్రూ నాయక్ అధ్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన నెహ్రూ నాయక్ మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, అలాగే అన్ని రంగాలలో రాణించాలని కోరారు. దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. భవిత సెంటర్‌లో ప్రత్యేక ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రజిత, తవటం ప్రవీణ్‌లను, ఆయాగా పనిచేస్తున్న శోభను అభినందించారు. అనంతరం వివిధ ఆటల పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రత్యేక ఉపాధ్యాయులు తవుటం ప్రవీణ్, ఎం.రజిత మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు అందిస్తున్న వివిధ రకాల సేవలు, సదుపాయాల గురించి వివరించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జగదీష్, అలీ, ఎంఐఎస్ అజయ్, సీఆర్‌పీలు ఉమారాణి, మున్ని, షఫీ, నిర్మల, రాజమణి, ఎమ్మార్సీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





