– ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్ఫర్మేషన్ పాలసీ పేరుతో అక్రమాలు
– అది లూటింగ్ పాలసీగా మారింది
~ మాది నమ్మకం పెంచిన ప్రభుత్వం.. మీది అమ్మకాల సర్కారు
~ రూ.5లక్షల కోట్ల భూమి రూ.5వేల కోట్లకే కట్టబెడుతున్నారు
~ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్ఫర్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీగా మారిందన మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. కుంభకోణాలకు కేఆరాఫ్ అడ్రస్ అయినటువంటి కాం గ్రెస్ పార్టీ కొత్త చేస్తున్న స్కామే ఈ కొత్త పాలసీ అన్నారు. పారిశ్రామిక వాడల్లోని దాదాపు పది వేల ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లా అమ్ము కునే కుట్రకు రేవంత్ ప్రభుత్వం తెరలేపిందన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అడ్డగోలు దోపిడీ మీదనే దేవంత్ దృష్టి పెట్టిండని ఆరోపించారు. లగచర్ల కావచ్చు, హెచ్ సీయూ భూములు కావచ్చు .. ఇలా ఏది చూసినా దోపిడీనే. ప్రజలకు ఏం చేయాలనే ధోరణి కంటే ఎక్కడ ఎంత దోపిడీ చేయాలన్నదే రేవంత్ ఆలోచన విధానమన్నారు. మా హయాంలో అనుమతులు, పెట్టుబడుల వార్తలు వచ్చేవి. అమ్మకాల వార్తలు కాంగ్రెస్ హయాంలో వస్తున్నాయన్నారు. మాది నమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం అయితే కాంగ్రెస్ అమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం. గజాల లెక్కన మొదలుకొని వేల ఎకరాల దాకా ప్రతి ఇంచు భూమి అమ్మేస్తున్నడు. హౌజింగ్ బోర్డులో ఉన్న ఆరు గజాలు, ఎనిమిది గజాలు కూడా అమ్ముతున్నాడు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి భూములు అమ్ముకుంటూ పోతే ఎలా.. ఆసుపత్రులు, విద్యాలయాలు చివరకు శ్మశానాలు ఏర్పాటు చేయడానికి కూడా భూములు మిగలవు అన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం భూములు మిగల్చవా అంటూ ప్రశ్నించారు. నగరం విస్తరణ జరిగితే ఇతర రాష్ట్రాల్లో పారిశ్రామిక భూములను 50శాతం భూమిని ప్రభుత్వం తీసుకొని, మిగతా 50శాతం భూములను జులు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తున్నరు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేవలం 30శాతం తీసుకొని తెగనమ్ముతున్నడు. అనుముల రేవంత్ రెడ్డి కాదు, అమ్మకాల రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. నిన్న బిఆర్ఎస్, కేటీఆర్ చెప్పిన మాటలు అక్షరసత్యం. శ్రీధర్ బాబు కూడా కొన్ని ఒప్పుకున్నారు. అందుకు థ్యాంక్స్. వేల కోట్లు, లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు తెరలేపిన స్కాం ఇది. 9292 ఎకరాల భూమిని 30శాతం రిజిస్ట్రేషన్ ద్వారా కట్టబెడితే 5వేల కోట్లు వస్తుందని శ్రీధర్ బాబే చెప్పారు. 9292 ఎకరాల భూముల విలువ రూ.5లక్షల కోట్లు. రూ.5వేల కోట్లకే ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. మిగతా రూ.4 లక్షల 95వేల కోట్లు స్కాం కదా? ఎందుకు కట్టబెడు తున్నారు. దీని వెనుక ఉన్న మత్లబ్ ఏమిటని ప్రశ్నించారు. 9292లో మొత్తం భూమి కాదు, ఇం దులో రోడ్లు, మోరీ పోగా 4740ఎకరాలే ఉంటదని మంత్రి బుకాయించారు. నేను అథారిటీగా చెబుతున్నాను. రెవెన్యూ రీసోర్సు మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా చెబుతున్నా. నాతోపాటు కేటీఆర్, ప్రశాంత్ ఇతర మంత్రులు ఉన్నారు. ఆరోజు కూడా ఈ ప్రతిపాదన వచ్చింది. శ్రీధర్ బాబుకు నేను సవాల్ చేస్తున్నా, నిజంగా 4740 ఎకరాలే ప్రభుత్వం పెట్టిందా? దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా? సగానికి సగం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీధర్బాబు భూ కుంభకోణం పరిధి తగ్గించే ప్రయత్నం చేసారని ఆరోపించారు. నిన్న కేటీఆర్ ప్రశ్నలకు మంత్రి గాని, ప్రభుత్వం గాని సమాధానం చెప్పలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ తో పోల్చితే రెండు రెట్ల స్కాం రెండు బడ్జెట్ లతో సమానమైన ఇంతటి నిర్ణయాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టకుండా రాత్రికి రాత్రే చేస్తం అంటే ఎందుకు ఊరుకుంటాం? కేటీఆర్అ డిగిన ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం ఎందుకు సమాధా నం చెప్పదు? కోర్టు ఆర్డర్ ఉన్నందున ఆనాడు మేము ఆజామాబాద్ భూముల విషయంలో నిర్ణ యం తీసుకున్నాం. ఎస్ ఆర్ వో కింద 200 శాతం తీసుకున్నం. ఈనాడు కాంగ్రెస్ మాత్రం 30శాతం కడితే చాలు అంటున్నది. రూ. 5లక్షల కోట్లు ల్సిన చోట రూ.5వేల కోట్లు మాత్రమే వస్తాయని మంత్రి కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజా నాకు తీరని నష్టం ఇది. వారం రోజుల్లో అప్లికేషన్లు పెట్టాలి. వారంలో టీజీఐఐసీ అప్లికేషన్ల పరిశీలన, అవతల వారం రోజుల్లో అధికారుల కమిటీ అను మతి, ఇది వచ్చిన రెండు నెలల్లో మొత్తం స్కాం కథ పూర్తి. అంటే 2 నెలల్లో రూ.5లక్షల కోట్లకు స్కెచ్ వేసింది రేవంత్ సర్కారు. మార్కెట్ లో అమ్మితే రూ. 5లక్షల కోట్లు వస్తయి కదా అంటే సమాధానం లేదు? కోర్టు కేసులు, లీజుల వివాదాలు కారణం చూపి మొత్తం భూమిని తక్కువ ధరకే కొల్లగొట్టాలని కుట్ర చేస్తున్నారా? అంటే సమాధానం లేదు. ప్రపంచ పెట్టుబడులు ఆకర్షించేందుకు టీఎస్ ఐపాస్ పాలసీ తెచ్చినం. కాంగ్రెస్ మాత్రం భూము లు అమ్మడానికి హిల్ టీపీ పాలసీ తెస్తున్నరు. ఓఆర్ఆర్ లోపల కాలుష్యకారక పరిశ్రమలు పాలసీ ద్వారా తరలి వెళ్తాయన్నారు. వెలుపలకు పంపాలి. గ్రీన్ కంపెనీలు కూడా
మీ పాలసీ ద్వారా తరలివెళ్తాయన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





