రైతుల జీవనాడితో ఆటలొద్దు

– ప్రాజెక్టుల మోటార్లతో ప్రభుత్వం చెలగాటం
– నిబంధనలకు విరుద్ధంగా పదేపదే ఆన్ఆఫ్
-మోటార్లు పాడు చేసి ఆ నెపం మాపై నెట్టే కుట్ర
– ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను నాశనం చేయొద్దు
– మంత్రి ఉత్తమ్ కు ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8 కాళేశ్వరం, దేవాదుల వంటి ప్రతిష్టాత్మక నీటిపారు. దల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభు త్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీ ష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డికి ఆయన బుధవారం ఒక బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా, అశా స్త్రీయంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ ప్రభు త్వం ఇంజనీరింగ్ సూత్రాలను తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు.

ఉద్దేశపూర్వక కుట్రనా?

భారీ నీటిపారుదల మోటార్లు నిరంతరాయం గా నడిచేలా డిజైన్ చేసినవని, వాటిని ఇష్టా నుసారం స్టార్ట్, స్టాప్ చేయడం వల్ల తీవ్రమైన వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటార్లు పాడైపోయే ప్రమాదం ఉందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. “వేల కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన ప్రాజెక్టులను ఇలా నిర్ల క్ష్యంగా వాడటం శోచనీయం. కావాలనే మో టార్లను పాడుచేసి, ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా?” అని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ పాల నాపరమైన నిర్లక్ష్యమా లేక రాజకీయ ప్రయో జనాల కోసం చేస్తున్న కుట్రనా అని నిలదీశారు. ముఖ్యంగా చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని హరీష్ రావు
లేఖలో పేర్కొన్నారు. తక్షణమే ఈ అశాస్త్రీయ విధానాన్ని మానుకోవాలని, ఇంజనీ రింగ్ నిబంధనల ప్రకారం పంపులను నిరంత రాయంగా నడిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయ వైషమ్యాల కోసం తెలంగాణ రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులను దెబ్బతీ యవద్దని ఆయన హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను పణంగా పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *