క్రీడల్లో ప్రతిభావంతుల‌కు ప్రభుత్వం అండ

– ఆర్థిక సాయం, ప్రోత్సాహకాలపై మంత్రి వాకిటి సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 2026-2027 బడ్జెట్‌లో క్రీడాకారులకు ఆర్థిక సహాయం, ఇతర వసతులపై సచివాలయంలో మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన క్రీడా పాలసీ తీసుకొచ్చి క్రీడలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను ఆటల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నామని వివరించారు. అందులో భాగంగా క్రీడా శాఖకు 2026-2026 బడ్జెట్‌లో అధిక నిధుల కేటాయింపుతోపాటు, క్రీడాకారులకు ఆర్థిక సహాయంపై అధికారులతో చర్చించారు. ఒలింపిక్, పారా ఒలింపిక్, అంతర్జాతీయ, జాతీయ ఆటల పోటీల్లో పతకాలు సాధిందించిన వారికి ఆర్థిక సహాయం అందించేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉండేలా ప్రతిపాదనలు పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఆటల్లో ప్రతిభ కనబరుస్తున్న వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని చెప్పారు. పేర్కొన్నారు. క్రీడాకారులకు ఇచ్చే పారితోషికాలపై విధివిధానాలు రూపొందించాలని, వాటిని నిష్పక్షపాతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వీణ సోనీ బాలాదేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *