రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం వెన్నుదన్ను

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని నీటిపారుదల, పౌరసరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు నందించడంతోపాటు నిర్మాణరంగదారులకు అనువైన పద్దతిలో చేయూతనందిస్తుందని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో-2026 ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలసి మంత్రి ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగాన్ని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యంగా ప్రభుత్వం పరిగణిస్తున్నదన్నారు. అందుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను సరళీకృతం చేయడంతోపాటు నీటిపారుదల శాU అనుమతుల్లో జాప్యాన్ని సత్వరమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. విస్తరిస్తున్న మహానగరానికి అనుగుణంగా తరలి వస్తున్న పెట్టుబడులతో హైదరాబాద్ నగరం భారత దేశంలో అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ నగరాలలో ఒకటిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌తో తన కుటుంబానికి ముడిపడి ఉన్న అనుబంధాన్ని, అనుభూతిని ఆయన పంచుకుంటూ ప్రస్తుత పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీలలో తన తండ్రికి వ్యవసాయ భూములు ఉండేవని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం క్రెడాయ్‌కు సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తుందని ప్రకటించారు. అదే సమయంలో నిర్మణారంగ అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిర్మాణ రంగంతో పాటు ఐ.టి, పరిశ్రమలు, పర్యాటకం తదితర రంగాలలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐ.టి శాU మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంశించారు. పెట్టుబడులను అహ్హనించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో హైదరాబాద్ విస్తరణకు ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. ప్రపంచస్థాయితో పోటీపడేలా మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని చెప్పారు. నిజాం కాలం నుండి వారసత్వ సంపదగా కొనసాగుతున్న సాంస్కృతిక సంప్రదాయ వ్యవస్థను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *