– చట్టబద్ధ రిజర్వేషన్ల తర్వాతే జరపాలి
– బీసీ సంఘాల డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర బ్యూరో, నవంబ ర్ 22: అనేక వాయిదాలు, కోర్టు కేసుల త ర్వాత ఎట్టకేలకు స్థానిక ఎన్నికలు జరిపేం దుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ముందు గా పంచాయితీ ఎన్నికలు జరిపి, ఆ తర్వాత ఎంపిటీసి, జడ్పీటీసి ఎన్నికల కు వెళ్ళాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జా రీ చేసింది. అయితే స్థానిక ఎన్నికలనాటికి బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించా లనుకున్న ప్రభుత్వ సంకల్పం మాత్రం నెర వేరకుండా పోయింది. గతం లో లాగానే 50 శాతం రిజర్వేషన్లకు మిం చకుండా ప్రక్రియను పూర్తిచేయాల్సి వొచ్చింది.. ఇందుకు బీసీ సంఘాలు తీవ్రంగా వ్య తిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి న హామీని నిలుపుకోకుండా రాష్ట్రం లోని రెండు లక్షల మంది బీసీలకు అన్యాయం చేస్తున్నదంటూ వారు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. తమ కిచ్చిన మాట ప్రకారం 42శాతం చట్టబ ద్ధత కల్పించిన తర్వాతే ఎన్నికలు జరుపాల ని వారు డిమాండ్ చేస్తున్నారు. కేవలం పా ర్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పి స్తామంటే కుదరదని, పార్లమెంటులో బిల్లు పెట్టేవరకు ఎన్నికలను వాయిదా వేయాల్సిందేనంటున్నారు. ఇండియూ కూటమికి పార్లమెంటులో 240 మంది ఎంపీలున్నా ఈ విషయంలో ఎందుకు ప్రస్తావించటం లేదని వారు కాంగ్రెస్ను నిలదీస్తున్నారు. కోర్టు వత్తిడి, 15వ ఆర్థిక సంఘ కాలప రిమితి దాటిపోతే, రాష్ట్రానికి సంక్రమించే మూడువేల కోట్ల నిధులు వృధా అవుతా యంటున్న ప్రభుత్వ మాటలను బీసీ సంఘాలు ఖండిస్తున్నాయి. పంచాయితీ నిధులకన్నా బీసీ రిజర్వేషన్లే ముఖ్యమంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రధాని నరేంద్రమోదీ వ ద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి 42శాతం బీసీ రిజ ర్వేషన్లను సాధించాలంటూ డిమాండ్ చేస్తు న్నారు. కాని పక్షంలో బీసీలంతా తమ చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతూనే ఉంటారని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టరేట్ల ముందు బీసీ నాయకులు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదిలాఉంటే ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధంచేస్తున్నది. ఈనెల 24న హైకోర్టులో పంచాయితీ ఎన్నికలకు సం బందించిన కేసు విచారణకుంది. కోర్టు తీర్పు ఎలాఉన్నా, ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎ న్నికల నిర్వహణ విషయంలో జరిగిన జాప్యం పై కోర్టు చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి కోర్టు చీవాట్లు పెట్టకుండా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించామని ప్రభు త్వం ఇప్పుడు చెప్పుకునే అవకాశముంది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లను 50 శాతానికి మించకుడదంటూ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది. 2011 జనగణన, ఎస్ఐపిసి (సోసియో ఎకనమిక్, ఎ డ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే) ఆధారంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహి ళా రిజర్వేషన్లకు ఇప్పటికే కసరత్తు చేపట్టింది. అయితే ఈ రిజర్వేషన్లను రొటేషన్ పద్దతిలో నిర్వహిస్తారు. ఇంతకు క్రితం ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు, గ్రామాలను మళ్ళీ రిజర్వ్ చేయ రు. ఇప్పటికే అనధికారికంగా మండలస్థాయిలో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేయడమైంది. ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిన వెంటనే వీటిని మరోసారి సరిచూసుకుని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి అందజేస్తారు. ఆదివారంనాటికి ఈ ప్రక్రియ కూడా అయిపోతుందనుకుంటున్నారు. కాగా, ఈ నెల 25న మంత్రివర్గం సమావేశమై ఎన్నికల నిర్వ హణ, రిజర్వేషన్ల విదానంపై మరోసారి చర్చించే అవకాశముంది. అనంతరం 26వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయను న్నట్లు తెలుస్తున్నది. మొత్తానికి డిసెంబర్ రెండవ వారంలోగా ఎన్నికల తంతు పూర్తి అవు తుందనుకుంటున్నారు. వాస్తవంగా గ్రామ పంచాయితీల గడువు 2024 మార్చ్ 31తో ముగిసింది. అప్పటినుండి ఆరునెలల్లో ఎన్నిక లు జరుగాల్సి ఉండింది. కాని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన, ఇతర కారణాలతో వాయి దా పడుతూ వచ్చింది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొద్దికాలానికే పంచాయితీల కాలహ రమితి ముగియడంతో వెంటనే ఎన్నికలకు వెళ్ళే విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిం చాలనుకోవడం కూడా ఎన్నికల జాప్యానికి ఒక కారణమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ళ కా లంలో వొచ్చిన రెండు ఉప ఎన్నికల్లో ఊహిం చని రీతిలో అనుకూల ఫలితాలు రావడంతో పంచాయితీ ఎన్నికలను ధైర్యంగా నిర్వహిం చేందుకు సిద్ధపడింది. అయితే సమాజంలో మె జార్టీగా ఉన్న బీసీలు మాత్రం ఆగ్రహంగా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికలకు ముందు 42 శాతం బీసీ రిజర్వేషన్లను కల్పిస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు 22 శాతానికి కుదించి ఎన్నికలకు పోవడాన్ని ఎట్టిపరిస్థితిలో అంగీకరించేదిలేదంటున్నారు. అధికార పార్టీలు కల్పించే పదవులు, ప్రయోజనాలకు తాము లొంగబోమని, పేదరికం, బలహీనతలనుకూడా అదిగమించి, భవిష్యత్ తరాల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామంటున్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





