బోధన్ అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

– షకీల్ నాయకత్వంలో 36 కౌన్సిలర్ స్థానాలు బీఆర్ఎస్‌వే
– అవినీతి కుంభకోణాల్లో కాంగ్రెస్ మంత్రులు
– కేసీఆర్ మాత్రమే ప్రజలకు శ్రీరామరక్ష
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల

బోధన్, ప్రజాతంత్ర, జనవరి 19: బోధన్ పట్టణ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, మాజీ ఎమ్మెల్యే షకీల్ హయాంలో మంజూరైన పనులను కూడా నిలిపివేసి ప్రజలను శిక్షిస్తోందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్ పట్టణంలో సోమవారం జరిగిన బీఆరఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. బోధన్ టౌన్ విÖటింగ్ చూస్తుంటే నియోజకవర్గ, జిల్లాస్థాయి సభలా ఉందని, ప్రజల ఉత్సాహం చూస్తుంటే బోధన్ మున్సిపాలిటీపై మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. షకీల్ నాయకత్వంలో 36 మంది కౌన్సిలర్లు భారీ మెజారిటీతో గెలవడం తథ్యమన్నారు. కేసీఆర్, కేటీఆర్ సహకారంతో షకీల్ బోధన్ అభివవృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయించారని, అందులో రూ.60 కోట్ల పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. రెండేళ్లుగా ఇక్కడి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన రూ.40 కోట్ల పనులను చేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు. రోడ్లన్నీ గుంతలమయంగా మారినా మరమ్మతులు కూడా చేయలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హావిÖలను నెరవేర్చలేదని, కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. జూపల్లి కష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య వాటాల పంపకాల్లో తేడాలు వచ్చి రోడ్డున పడ్డారని ఎద్దేవా చేశారు. షకీల్ హయాంలో పగడపల్లి వద్ద నదిపై చెక్ డ్యాం నిర్మించి రైతులకు మేలు చేశామని, ఇప్ప్పుడున్న ఇరిగేషన్ శాఖ మంత్రి, స్థానిక పెద్ద మనుషులు ఒక్క కొత్త చెక్ డ్యాం ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ పట్టుకొని తిరిగిన రేవంత్ రెడ్డ్తికి బీఆరఎస్ జెండాను తాకే నైతిక అర్హత లేదని వేముల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. చంద్రబాబు చెప్ప్పుచేతల్లో నడిచే రేవంత్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రేవంత్ గతంలో ఇచ్చిన హామీల వీడియోలను (పెన్షన్ పెంపు, మహిళలకు ఆర్థిక సాయం) ప్రతి ఇంటికి వెళ్లి చూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాట తప్పిన కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలి అని ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని, బీఆరఎస్ పార్టీని మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు షకీల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, గణెళిష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ విజిగౌడ్, గిర్ధవర్ గంగారెడ్డి, నర్సింగ్ రావు మాజీ జెడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపిటిసిలు, పార్టీ ప్రతినిధులు, బీఆరఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *