– స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ అమలు పరచాల్సిందే
– కామారెడ్డి బి.సి డిక్లరేషన్ హామీలు నెరవేర్చాలి
– బీసీ నాయకుల డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: బీసీ రిజర్వేషన్ల అమలు, ప్రయోజనాల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఈశ్వరాచారి ఆత్మహత్యకు కారణమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగద్గిరిగుట్ట బీరయ్య నగర్‌లోని ఆయన నివాసానికి శనివారం చేరుకున్న బీసీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులు ఈశ్వరాచారికి ఘన నివాళులు అర్పించారు. సాయి ఈశ్వర్ ను స్మరిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ — “సాయి ఈశ్వరాచారి త్యాగం వెలకట్టలేనిది. ప్రజల ఆవేదనను ప్రభుత్వం తేలికగా తీసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. . ఆయన ఆశయ సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం,” అని కృష్ణయ్య తెలిపారు. స్థానిక ఎన్నికలను వెంటనే వాయిదా వెయ్యాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్ల తోని ఎన్నికలు జరపాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం కనువిప్పు తెచ్చుకొని కామారెడ్డి బి.సి డిక్లరేషన్ లోని హమీలన్ని నేరవేర్చలన్నారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ సాయి ఈశ్వరాచారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఇంత సంఘటన జరిగినా ప్రభుత్వం స్పందించకపోవడం నియంత్ర వైఖరికి నిదర్శనం అన్నారు. సాయి కుటుంబాన్ని ప్రభుత్వం సముచితంగా ఆదుకోవాలని ఇప్పటికైనా ప్రజాస్వామ్య స్పూర్తితో నిర్ణయాలు వెంటనే చేపట్టాలని అయన కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డా. ర్యాగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన కోసం ప్రాణత్యాగాలు చేసే పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం అన్నారు. సాయి ఈశ్వర్ మరణం ప్రభుత్వంకు తీవ్రమైన హెచ్చరిక అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బి.సి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం మాట్లాడుతూ — “మన హక్కుల కోసం పోరాటం చేస్తున్న బీసీ–బహుజన యువకులు ఇలాంటి చర్యలకు దిగడం మన సమాజానికి ఎంతో బాధాకరం. తెలంగాణ సాధనలో 1,200 మందికి పైగా బీసీ, బహుజన, వంచిత వర్గాల బిడ్డలు ప్రాణాలు అర్పించారు. ఇక చాలు… ఇక నుంచి బలిదానాలు కాదు — పోరాటమే మార్గం అని స్పష్టం చేశారు. సాయి ఈశ్వర్‌కు నివాళులు అర్పించిన వారిలో ఘన నివాళులు అర్పించిన వారిలో ఆర్. కృష్ణయ్య, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, గుజ్జ సత్యం, డా. ర్యాగా అరుణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



