ఆదిలాబాద్‌కు ఇక మహర్దశ

– సిఎం హామీతో మారనున్న ముఖచిత్రం
– మంత్రి వివేక్‌ వెంకటస్వామి

ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు4: సిఎం రేవంత్‌ ‌రెడ్డి హామీలతో ఆదిలాబాద్‌ ‌రూపురేఖలు మారనున్నాయని మంత్రి వివేక్‌ అన్నారు. అలాగే రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ బలపరిచిన అభ్యర్థులు 95 శాతం స్థానాల్లో విజయం సాధిస్తారని, ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి పరాభవం తప్పదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. గ్రామాల అభివృద్థికి పెద్దపీట వేయడంతో పాటు వాటిని పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందన్నారు.  ఆదిలాబాద్‌ ‌సిఎం సభలో పాల్గొన్న అనంతరం ఆయన తనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు, విశ్వవిద్యాలయం రావడం ప్రజాప్రభుత్వం విజయమన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమక్రమంగా అమలు చేస్తున్నామన్నారు. సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల విద్యుత్‌ ‌ఫ్రీ, నూతన రేషన్‌ ‌కార్డులు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ ఎన్నికల్లో వీటినే ప్రచారాస్త్రాలుగా నాయకులు ఉపయోగించాలని సూచించారు. అనంతరం పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్ధులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. సింగరేణిలో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని దీనికి సంబంధించి తమ ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి తెలిపారు. మందమర్రి ఏరియాలోని ఆర్‌కే ఓసీ విస్తరణతో ఏరియాకు భవిష్యత్‌ ఉం‌టుందని తెలిపారు. ఓసీ విస్తరించే ప్రాంతాల్లో ప్రజల డిమాండ్లను కూడా యాజమాన్యం పరిష్కరించాలన్నారు.సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకులకు సంబంధించి ఒరిస్సా తరహాలోనే వేలం పాటంలో దక్కించుకోవాలని కోరుతున్నామని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *