సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు

– రెడ్‌క్రాస్‌ పాలకవర్గ సభ్యుడు శ్రీనివాస్‌రావుకు ఎమ్మెల్యే నాయిని కితాబు

హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 18: రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర పాలకవర్గ సభ్యుడు ఇ.వి.శ్రీనివాస్‌ రావు తన చిన్ననాటి మిత్రుడని, పట్టుదలతో చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తారని, సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రశంసించారు. శ్రీనివాసరావు పుట్టిన రోజు సందర్భంగా హనుమకొండ సుబేదారిలోని రెడ్‌ క్రాస్‌ సొసైటీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించడంతోపాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా వరంగల్‌ నాయిని రాజేందర్‌రెడ్డి హాజరై పుష్పగుచ్ఛం, శాలువాతో సన్మానించి కేక్‌ కట్‌ చేయించి పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలియజేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ‘కుడా’ చైర్మన్‌ వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ రెడ్‌ క్రాస్‌ తరపున జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా శ్రీనివాసరావు సేవలందిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారని అన్నారు. ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ అధ్యక్షురాలు ఒ.లైలా పుష్పగుచ్ఛం అందజేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవా కార్యక్రమాలలో నిరంతరం పాల్గొంటూ ప్రతి ఒక్కరికీ శ్రీనివాసరావు చేదోడువాదోడుగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

అవసరమైన వారికి రక్తం దానం చేయాలి

రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ పి.విజయ చందర్‌ రెడ్డి మాట్లాడుతూ తలసీమియా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన శ్రీనివాస్‌ రావును అభినందిస్తూ పేదలకు సేవ చేసే కార్యక్రమాలలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజు వంటి శుభసందర్భాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించి, రక్తం కొరత లేకుండా చూసి, అవసరమైన వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌ పెద్ది వెంకటనారాయణ, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణుగోపాల్‌, పొట్లపల్లి శ్రీనివాస్‌ రావు, డాక్టర్‌ కె.సుధాకర్‌ రెడ్డి, డాక్టర్‌ సిహెచ్‌.సంధ్యారాణి, చెన్నమనేని జయశ్రీ, బిళ్ల రమణారెడ్డి, బాశెట్టి హరిప్రసాద్‌, తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్‌ మోహన్‌ రావు, కార్యదర్శి ఫణికుమార్‌, హనుమకొండ జిల్లా కార్యదర్శి డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు మాధవరెడ్డి, కార్పొరేటర్లు తోట వెంకన్న, శ్రీమాన్‌, మానస రాంప్రసాద్‌, భూపాలపల్లి రెడ్‌ క్రాస్‌ పాలకవర్గ సభ్యుడు బొద్దిరెడ్డి సతీష్‌ రెడ్డి, రెడ్‌ క్రాస్‌ జీవితకాల సభ్యులు సోదా రామకృష్ణ, బంక సంపత్‌, బంక సరళ, బొల్లం శివ, మానుపాటి శ్రీను, నేహాల్‌, శివకుమార్‌, రెడ్‌ క్రాస్‌ సిబ్బంది, స్నేహితులు, ఆప్తులు, అభిమానులు పాల్గొని శ్రీనివాసరావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *