వలస కార్మికులకు కేంద్రం శుభవార్త

– ఇకపై 5 కేజీల రెండు సిలిండర్ల సరఫరా
– రాష్ట్రాలకు సూచించిన కేంద్రం

న్యూదిల్లీ, ఏప్రిల్‌ 7:‌ వలస కార్మికులకు కేంద్రం ఊరట కలిగించింది. వారికి గ్యాస్‌ ‌సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు 5 కేజీల ఎఫ్‌టీఎల్‌ ‌గ్యాస్‌ ‌సిలిండర్ల సరఫరా రెట్టింపు చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్‌ లేఖ రాశారు. ఓఎంసీల సహాయంతో పౌర సరఫరాల శాఖ ద్వారా గ్యాస్‌ ‌పంపిణీ చేయాలని సూచించారు. ఎల్‌పిజి గ్యాస్‌ ‌కొరత వల్ల దేశంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వలస కార్మికుల సంగతి సరేసరి. ఈ నేపథ్యంలో వలస కార్మికులని దృష్టిలో ఉంచుకుని రోజుకి 5 కేజల గ్యాస్‌ ‌సిలిండర్‌ అ‌డ్రస్‌ ‌ప్రూఫ్‌ ‌లేకుండా.. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి కొనుగోలు చేయవచ్చని ఇటీవల కేంద్రం ప్రకటించింది. ఐదు కేజీల గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌సపంలో ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర అందుబాటులో ఉంటుందని పెట్రోలియం శాఖ తెలిపింది. తాజాగా మంగళవారం వలసకార్మికులకు ఇచ్చే గ్యాస్‌ ‌సిలిండర్ల సంఖ్యను కేంద్రం డబుల్‌కి పెంచింది. అంటే వలస కార్మికులు రోజుకి రెండు ఐదు కేజీల ఎల్‌పిజి సిలిండర్లను కొనుగోలు చేసేందుకు మంత్రిత్వశాఖ వీలు కల్పించింది. ఈ మేరకు అన్ని రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శలకు మంత్రిత్వశాఖ లేఖ రాసింది. మార్చి 21న రాష్టాల్ర సీఎస్‌లకు రాసిన లేఖలో వలస కార్మికులకు ఐదు కేజీ సిలిండర్‌లను ఓఎంసి (ఆయిల్‌ ‌మార్కెటింగ్‌ ‌కంపెనీ)ల సహాయంతో ఇవ్వాలని లేఖ రాసింది. అయితే ఈ లేఖలో రాసిన దానికంటే 20 శాతం పరిమితికి మించి పెంచిన‌ట్లు, వలస కార్మికులకు సిలిండర్లను అందుబాటులో ఉంచాలని పెట్రోలియం శాఖ తాజాగా రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *