– రైతు భరోసా విడుదలకు రంగం సిద్దం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పనుంది. మున్సిపల్ ఎన్నికల పక్రియ ముగిసిన వెంటనే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎకరానికి రూ.6,000 చొప్ప్పున అర్హులైన రైతులకు ఈ సాయాన్ని అందించనున్నది. ఇందుకు ఈనెల 17 తేదీని ముహూర్తంగా నిర్ణయం చేసినట్లు తెలుస్తోంది. రైతు భరోసా నిధుల విడుదలతో పాటు స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సీఎం రేవవంత్‌రెడ్డి మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





