మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

– రేపటి రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ.588 కోట్లు
– ఇప్పటివరకు 2.45 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ పూర్తి
– ప్రయోజనం పొందనున్న 55,904మంది రైతులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాన్ని రైతుల ఖాతాలలో శుక్రవారం నుండి జమ చేసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీంతో మొత్తం 55,904మంది రైతులు లబ్ధి పొందుతారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేనప్పటికీ రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు నష్టపోకుండా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వమే పంట సేకరణ చేపట్టిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 2.45 లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న రైతుల నుండి సేకరించినట్లు వెల్లడిరచారు. ఇందుకుగాను రూ.588 కోట్లు రేపటి నుండి రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. రైతులను ఆదుకోవడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని, వారికి ఎలాంటి నష్టం కలగకుండా చూడటం తమ మొదటి ప్రాధాన్యమని మంత్రి నొక్కిచెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *